Begin typing your search above and press return to search.

నానికి ఫోర్లు సిక్సుల ట్రైనింగ్!

By:  Tupaki Desk   |   10 Sep 2018 5:55 AM GMT
నానికి ఫోర్లు సిక్సుల ట్రైనింగ్!
X
తెలుగుసినిమా దశ దిశ మారిందని ఇప్పటికే ఇప్పటికే ఫిలిం మేకర్స్ ప్రూవ్ చేస్తున్నారు. విభిన్న కథాంశాలు... న్యూ జెనరేషన్ ఫిలిం మేకింగ్ తో టాలీవుడ్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇక హీరోలు కూడా తమ రొటీన్ పంథాను విడిచి కొత్తగా ట్రై చేస్తున్నారు. పాత్రలను ఏదో చేశామన్నట్టుగా కాకుండా పాత్రల తీరుతెన్నులను ఆకళింపు చేసుకొనిమరీ నటనకు సిద్ధమవుతున్నారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ లిస్టులో జాయిన్ ఆయ్యాడు.

నాని ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో కలిసి 'దేవదాస్' అనే మల్టిస్టారర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ ఆఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత నాని 'జెర్సీ' అనే క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో నాని ఒక క్రికెటర్ పాత్ర పోషిస్తాడు.. దీంతో ఆ పాత్రను మరింత అథెంటిక్ గా పోషించేందుకు క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడట. 'దేవదాస్' సినిమా ప్రమోషన్స్ హంగామా ముగిసిన తర్వాత అక్టోబర్ మొదటి వారం నుండి నాని క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటాడట.

'జెర్సీ' రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో ప్రారంభం అవుతుందట. ఈ సినిమాలో 'నర్తనశాల' ఫేం కష్మీర పరదేశి హీరోయిన్. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తాడు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తారు.