Begin typing your search above and press return to search.

ప్లేటు ఫిరాయించిన కౌశల్ కు నాని క్లాస్!

By:  Tupaki Desk   |   5 Aug 2018 10:43 AM GMT
ప్లేటు ఫిరాయించిన కౌశల్ కు నాని క్లాస్!
X
తెలుగు బిగ్ బాస్ -2 మొద‌ట్లో చ‌ప్ప‌గా అనిపించినా....హోస్ట్ నాని చెప్పిన‌ట్లుగా రానురాను ఇంకొంచెం మ‌సాలా డోసు పెర‌గ‌డంతో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోంది. ఈ సీజ‌న్ లో ఏమైనా జ‌ర‌గొచ్చు అన్న ట్యాగ్ లైన్ కు త‌గ్గ‌ట్లుగానే....అనూహ్య‌మైన మ‌లుపుల‌తో ప్ర‌స్తుతం షో ర‌క్తి క‌డుతోంది. షోలో భాగంగా ప్ర‌తి శ‌నివారం ...సెలక్టెడ్ కంటెస్టంట్ల‌కు నాని చాకిరేవెట్ట‌డం మామూలే. అయితే, ఇప్ప‌టివ‌రకు కౌశ‌ల్ కు ఆ సీన్ ఎదురుకాలేదు. కానీ, నిన్నటి ఎపిసోడ్ లో కౌశ‌ల్ కు నాని కాస్త గ‌ట్టిగానే క్లాస్ తీసుకున్నాడు. గ‌త వారం బిగ్ బాస్ ఇచ్చిన పైరేట్స్‌ Vs సర్వైవర్స్ టాస్క్ సంద‌ర్భంగా యాంక‌ర్ దీప్తిని...నందినీ - కౌశ‌ల్ లు కింద‌ప‌డేయ‌డంతో ఆమె కాలు నలిగిపోయింది. ఈ విష‌యంలో కౌశ‌ల్ డ‌బుల్ గేమ్ ఆడాడ‌ని తెలుసుకున్న నాని....కౌశ‌ల్ కు క్లాస్ పీకాడు. ఆ టాస్క్ లో బ‌ల్ల‌ను ఎత్తివేసి దీప్తిని ప‌డేయాల్సిందిగా నందినీకి చెప్పిన కౌశ‌ల్ ....ఆ త‌ర్వాత తాను చెప్ప‌లేద‌ని బుకాయించ‌డంతో నాని ఇలా చేయాల్సి వ‌చ్చింది. కౌశ‌ల్ ఇదే ధోర‌ణి కొన‌సాగిస్తే...ఆయ‌న‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ త‌గ్గిపోతుంద‌ని కూడా నాని హెచ్చ‌రించాడు.

పైరేట్స్‌ Vs సర్వైవర్స్ టాస్క్ లో భాగంగా సర్వైవర్స్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన చెక్కబల్లలపై ఉన్న స‌ర్వైవ‌ర్స్ ను పైరేట్స్‌ కిందికి దింపాలి. ఈ క్ర‌మంలో సర్వైవర్స్‌ బల్ల ఎక్కిన త‌ర్వాత దిగ‌కూడ‌దు. ఏ జట్టు తక్కువ సమయంలో స‌ర్వైవ‌ర్స్ ను కింద‌కు దింపుతారో వారే ఆ టాస్క్‌ విజేత. ముందుగా సర్వైవ‌ర్స్ టీమ్ లో గీతామాధురి - దీప్తి సునయన - రోల్‌ రైడా - పూజా రామచంద్రన్‌ - టీవీ9దీప్తి - సామ్రాట్ లు ఉన్నారు. పైరేట్స్ గా కౌశల్‌ - నందనీ - తనీష్‌ - బాబుగోగినేని - గణేశ్‌ - అమిత్ లున్నారు. అయితే, చెక్కబల్లలను ఎత్తిన పైరేట్స్ ....సర్వైవ‌ర్స్‌ ను కిందికి దింపేశారు. ఈ సమయంలో నందినీ - కౌశల్‌.. దీప్తి బల్లను ఎత్తే ప్రయత్నంలో ఆమె కాలు నలిగిపోయింది.. ఆ బాధను తట్టుకోలేక దీప్తి ఏడ్చింది. టాస్క్‌ పూర్తి అయిన అనంతరం దీప్తికి నందినీ సారీ చెప్పింది. దీంతో కౌశల్‌-నందినీల మధ్య గొడవ జరిగింది.

బ‌ల్ల ఎత్తి వేద్దామ‌ని కౌశ‌ల్ త‌న‌తో చెప్పాడ‌ని....ఆ త‌ర్వాత ఎత్తే స‌మ‌యంలో ప‌క్క‌కు జ‌రిగాడ‌ని నందినీ ...నానికి చెప్పింది. ఆ బ‌ల్ల‌ను తాను మోయ‌లేక‌పోయాన‌ని...అందుకే దీప్తి కింద‌ప‌డిందని చెప్పింది. అయితే, తాను అలా చెప్ప‌లేద‌ని కౌశ‌ల్ బుకాయించాడు. దీంతో, నందినీ - కౌశ‌ల్ లు మాట్లాడిన క్లిప్ ను నాని ప్లే చేశాడు. దీంతో, కౌశల్ అడ్డంగా బుక్క‌య్యాడు. అంద‌రూ అలా చేస్తున్నార‌ని...అందుకే త‌న‌కిష్టం లేక‌పోయినా....తానూ నందినీతో అలా అన్నాన‌ని అంగీక‌రించాడు. అప్పుడు కూడా త‌న‌ను తాను డిఫెండ్ చేసుకోవ‌డానికి కౌశ‌ల్ ప్ర‌య‌త్నించ‌డంతో నాని...క్లాస్ పీకాడు. షో ప్రారంభంలో త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో కౌశ‌ల్ అభిమానుల‌ను సంపాదించుకున్నాడ‌ని...ఈ ర‌కంగా డ‌బుల్ స్టాండ‌ర్డ్స్ మెయింటెన్ చేయ‌డం వ‌ల్ల‌.....ఆ అభిమానులు దూర‌మ‌య్యే ప్ర‌మాద‌ముంద‌ని హెచ్చ‌రించాడు. నిన్న కౌశ‌ల్ - బాబు సేఫ్ అని నాని అనౌన్స్ చేయ‌డంతో.... ఈ రోజు ....టీవీ 9 దీప్తి - గ‌ణేష్ - నందినీల‌లో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో చూడాలి.