Begin typing your search above and press return to search.

నానిని మునుపెన్నడు చూడని విధంగా చూపిస్తాడట

By:  Tupaki Desk   |   12 May 2020 12:15 PM IST
నానిని మునుపెన్నడు చూడని విధంగా చూపిస్తాడట
X
నాని 25వ చిత్రం ‘వి’ విడుదలకు సిద్దంగా ఉంది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా విడుదల వాయిదా పడినది. ఇదే సమయంలో నాని శ్యామ్‌ సింగరాయ్‌ అనే చిత్రానికి కూడా ఓకే చెప్పాడు. ఫస్ట్‌ లుక్‌ కూడా వచ్చేసింది. ట్యాక్సీవాలా చిత్ర దర్శకుడు రాహుల్‌ సంకర్శన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుంది. ఈ చిత్రం గురించి వస్తున్న సోషల్‌ మీడియా టాక్‌ అంచనాలు పెంచేస్తూనే ఉంది.

దర్శకుడు రాహుల్‌ చాలా విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. నానిని ప్రేక్షకులు గతంలో ఎప్పుడు చూడని విధంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కథ విలక్షణంగా ఉండటంతో పాటు సినిమాలోని పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. నాని కెరీర్‌ లో నిలిచి పోయే సినిమాగా ఇది ఉంటుందని అంటున్నారు.

నాని ‘వి’ చిత్రంలో మొదటి సారి నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించబోతున్నాడు. అందుకు సంబంధించిన లుక్‌ ఇప్పటికే అందరిని ఆకట్టుకుంది. ఇక రామ్‌ సింగరాయ చిత్రం కోసం ఏకంగా నాని సిక్స్‌ ప్యాక్‌ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.