Begin typing your search above and press return to search.

నాని 'శ్యామ్‌ సింగ రాయ్‌' షూటింగ్ పూర్తి..!

By:  Tupaki Desk   |   26 July 2021 7:14 AM GMT
నాని శ్యామ్‌ సింగ రాయ్‌ షూటింగ్ పూర్తి..!
X
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''శ్యామ్‌ సింగ రాయ్‌''. కరోనా పరిస్థితుల అనంతరం ఇటీవలే షూటింగ్ తిరిగి ప్రారంభించిన మేకర్స్.. చిత్రీకరణ మొత్తం పూర్తి చేశారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెడుతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ ప్రభావం పడినా.. అకాల వర్షాలు భారీ గాలులు వచ్చి భారీ సెట్‌ ను దెబ్బతీసినా 'శ్యామ్ సింగ రాయ్‌' ను ఆపలేకపోయాయని పేర్కొన్నారు.

''శ్యామ్‌ సింగ రాయ్‌'' చిత్రంలో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో నాని కొత్త మేకోవర్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన నాని - సాయి పల్లవి ఫస్ట్ లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించేలా సరికొత్త స్టోరీతో దర్శకుడు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందుతోంది. బడ్జెట్‌ లో ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ స్కేల్‌ లో నిర్మాత వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా నిర్మాత చిత్ర బృందం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. 'శ్యామ్ సింగరాయ్' సినిమా రూపుదిద్దుకున్న తీరు పట్ల చాలా సంతోషంగా ఉంది. చాలా అడ్డంకులు ఎదురైనప్పటికీ.. మేము అంచనా అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేయగలిగాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు.

'శ్యామ్‌ సింగ రాయ్‌' చిత్రంలోని ముఖ్యమైన భాగాన్ని కలకత్తా లో చిత్రీకరించారు. బెంగాల్ సంస్కృతిని ప్రతిబింబించే భారీ ఆలయ సెట్ లో కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఈ సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్క నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఇది చాలా ప్రత్యేకమైన చిత్రమని మేకర్స్ చెబుతున్నారు. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు.

మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె.మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. 'శ్యామ్‌ సింగ రాయ్‌' చిత్రంలో జిషు సేన్‌ గుప్తా - రాహుల్‌ రవీంద్రన్‌ - మురళీ శర్మ - అభినవ్‌ గోమటం - లీలా శాంసన్ - మనీష్ వాద్వా - బారున్ చందా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.