Begin typing your search above and press return to search.

క్రిస్మస్ బరిలో నాని.. నాలుగు భాషల్లో 'శ్యామ్ సింగ రాయ్'..!

By:  Tupaki Desk   |   18 Oct 2021 6:24 AM GMT
క్రిస్మస్ బరిలో నాని.. నాలుగు భాషల్లో శ్యామ్ సింగ రాయ్..!
X
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''శ్యామ్‌ సింగ రాయ్‌''. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్‌ సాంకృత్యన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. 2021 డిసెంబర్‌ లో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ దసరా రోజు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని వెల్లడించారు.

''శ్యామ్‌ సింగ రాయ్‌'' చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు హీరో నాని ప్రకటించారు. అంతేకాదు పాన్ సౌత్ ఇండియా మూవీగా తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో బెంగాలీ యువకుడిగా కనిపిస్తున్న నాని.. సాయి పల్లవిని తన చేతులతో దగ్గరకు తీసుకొని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నారు.

'వి' 'టక్ జగదీష్' వంటి బ్యాక్ టూ బ్యాక్ డైరెక్ట్ ఓటీటీ రిలీజుల తర్వాత నాని నటించిన 'శ్యామ్‌ సింగ రాయ్‌' థియేట్రికల్ రిలీజ్ కు వెళ్తుండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 17న అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప:ది రైజ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీని తర్వాత వారం రోజులకు నాని సినిమా వస్తుండటం గమనార్హం.

'శ్యామ్‌ సింగ రాయ్‌' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. దసరా పండుగను పురస్కరించుకుని వదిలిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో నాని రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించి అలరించారు. భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ కు అవకాశం ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

'శ్యామ్ సింఘ రాయ్‌' నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. సత్యదేవ్‌ జంగా ఈ చిత్రానికి కథ అందించారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. ఇందులో జిషు సేన్‌ గుప్తా - రాహుల్‌ రవీంద్రన్‌ - మురళీ శర్మ - అభినవ్‌ గోమటం - లీలా శాంసన్ - మనీష్ వాద్వా - బారున్ చందా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.