Begin typing your search above and press return to search.

ఓటీటీ అంటే చిన్న బుచ్చుకున్న హీరో నాని!

By:  Tupaki Desk   |   4 Sep 2020 12:30 AM GMT
ఓటీటీ అంటే చిన్న బుచ్చుకున్న హీరో నాని!
X
మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ అంద‌రి త‌ల‌రాత‌లు మార్చేస్తోంది. సినీప‌రిశ్ర‌మ‌ల్ని అల్ల‌క‌ల్లోలం చేసింది. అయితే ఇలాంటి స‌మ‌యంలో మ‌రో ఆల్ట‌ర్నేట్ ఆలోచ‌న కూడా పెద్ద స‌క్సెస్ అవుతుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇన్నాళ్లు థియేట‌ర్లలోనే సినిమా చూడాలి.. అన్న ఆలోచ‌న‌కు ప్ర‌త్యామ్నాయంగా ఇప్పుడు ఓటీటీల్లోనూ చూడొచ్చు అన్న విధానం అమ‌ల్లోకి వ‌స్తోంది.

అయితే దీనిపై నేచుర‌ల్ స్టార్ నానీ ఏమ‌ని అభిప్రాయ ప‌డ్డారంటే.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో గ‌త్యంత‌రం లేకే మార్గం లేక‌నే ఓటీటీ రిలీజ్ కి వెళుతున్నామ‌ని సూటిగా చెప్పేశారు. నాని-సుధీర్ బాబు హీరోలుగా ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `వి` సినిమాని ఈనెల 5న అమెజాన్ ప్రైమ్ లో 200 దేశాల్లో స్ట్రీమింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత వైడ‌ర్ గా ప్రేక్ష‌కుల‌కు చేరువ కావ‌డంపై నాని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. థియేట్రిక‌ల్ రిలీజ్ లేద‌నే బాధే కానీ.. ఓటీటీలో ఇంత‌మంది ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం ఆనందాన్నిస్తోంద‌ని ఇది గొప్ప అనుభ‌వ‌మేన‌ని అన్నారు.

థియేట‌ర్ అంటేనే ప్రేక్ష‌కుల‌కు గొప్ప‌. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఉన్న ఏకైక‌ ఆఫ్షన్ ఓటీటీ అని కూడా అన్నారు. నాలుగేళ్ల త‌ర్వాత ఓటీటీ గురించి గొప్పగా చెప్పుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. కెరీర్ 25వ సినిమా మొద‌టి సినిమా ద‌ర్శ‌కుడితోనే.. అలాగే మొద‌టి సినిమా రిలీజ్ డేనే 25వ సినిమా రిలీజ్ డే అవుతోంది. ఇది యాథృచ్ఛిక‌మేన‌ని తెలిపారు. మొద‌టి సినిమా స‌మ‌యంలో ఎలా ఉన్నామో ఇప్ప‌టికీ అలానే మేం ఉన్నామ‌ని ఇంద్ర‌గంటితో అనుబంధం పై ముచ్చ‌టించారు. ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటితో మూడు సినిమాలు చేయ‌డం అనుబంధం పెంచింద‌న్నారు. మొత్తానికి థియేట్రిక‌ల్ లోటు త‌ప్ప 200 దేశాల్లో తాను ప‌రిచ‌యం అవుతుండ‌డం చూస్తుంటే నాని ఎగ్జ‌యిటింగ్ గానే ఉన్నాడు. కానీ ఓటీటీ అంటేనే ఎక్క‌డో చిన్న‌బుచ్చుకున్న‌ట్టు అనిపిస్తున్నాడు.