Begin typing your search above and press return to search.

శ్యామ్‌ సింగ రాయ్‌ ఏం చేస్తాడో తెలుసా?

By:  Tupaki Desk   |   6 Nov 2020 11:30 AM IST
శ్యామ్‌ సింగ రాయ్‌ ఏం చేస్తాడో తెలుసా?
X
నాని హీరోగా రాహుల్‌ సంకీర్త్యన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీ 'శ్యామ్‌ సింగ రాయ్‌'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా అందరిలో ఆసక్తి కనిపిస్తుంది. టైటిల్‌ విభిన్నంగా ఉండటంతో పాటు దర్శకుడు రాహుల్‌ ఈ సినిమాతో ఒక మంచి కమర్షియల్‌ థ్రిల్లర్‌ ఎంటర్‌ టైనర్‌ ను ఇస్తాడంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. ట్యాక్సీవాలా సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు రాహుల్‌ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ సినిమాలో నాని పాత్ర ఏంటీ అనే విషయమై యూనిట్ సభ్యులు లీక్‌ ఇచ్చారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని ఫిల్మ్‌ మేకర్‌ గా కనిపించబోతున్నాడు. కలకత్తా బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందబోతున్న ఈ సినిమాలో నాని ఫిల్మ్‌ మేకర్‌ గా ఏం చేస్తాడు అనేది చూడాలి. చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో నానిని చాలా కొత్తగా చూపించబోతున్నట్లుగా దర్శకుడు చెబుతున్నాడు. భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్స్‌ గా సాయి పల్లవి మరియు ఉప్పెన ఫేం కృతి శెట్టి లు నటించనున్నారు. టక్‌ జగదీష్‌ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్‌ లో నాని పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాపై నాని కూడా చాలా ఆసక్తిగా ఉన్నాడని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.