Begin typing your search above and press return to search.

అలర్ట్ అయిన నాని.. అతనికి బ్రేక్

By:  Tupaki Desk   |   30 April 2018 10:27 AM IST
అలర్ట్ అయిన నాని.. అతనికి బ్రేక్
X
న్యాచురల్ స్టార్ అంటూ ప్రేక్షకులతో తెగ గుర్తింపు పొందిన యంగ్ హీరో నాని. వరుసగా 8 విజయాలు సాధించి తిరుగులేని రికార్డు కూడా సృష్టించాడు. నాని నుంచి వచ్చిన ఎలాంటి చిత్రానికి అయినా పట్టం కట్టేశారు ఆడియన్స్. ఆ ఎనిమిది చిత్రాల్లో కూడా కొన్ని యావరేజ్ కంటెంట్ మూవీస్ ఉంటాయి. కానీ అవి కూడా హిట్టు పట్టాలు ఎక్కడంలో.. నాని క్రేజ్ కీలకం.

కానీ కృష్ణార్జున యుద్ధంతో నాని స్పీడ్ కు బ్రేక్ పడిపోయింది. ఈ మూవీ డిజాస్టర్ వసూళ్లతో నిలబడ్డమే కాదు.. నానిపై ఈ మధ్య వస్తున్న విమర్శలను నిజం చేసేసింది. తన చిత్రాలలో తన సహజమైన నటనే ఆకర్షణగా ఉండేలా.. కొత్త తరహా కథాంశాలను ఎంచుకోవడం నుంచి.. మాస్ ఎలిమెంట్స్ వైపు కదలడం.. ఎంసీఏ టైంలో విమర్శల పాలైంది. ఆ ఎఫెక్ట్ కృష్ణార్జున యుద్ధంపై పడింది. దీంతో తన తర్వాతి సినిమాల విషయంలో నాని బీ అలర్ట్ అయిపోయాడు. మరొక్క ఫ్లాప్ పడిందంటే.. ఇండస్ట్రీ జనాల నుంచే కాదు.. ఆడియన్స్ నుంచి వచ్చే విమర్శలు ఎలా ఉంటాయో ఊహించగలడు. అందుకే తన తర్వాతి చిత్రాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాని.

ఇందులో భాగంగా.. క్రేజీ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో సినిమాను పక్కన పెట్టేశాడనే టాక్ వినిపిస్తోంది. మేకింగ్ విషయంలో టైం తీసుకుంటాడు ఈ దర్శకుడు. అలాగని మనం మినహాయిస్తే.. భారీ సక్సెస్ లేవు. అయితే ఈ దర్శకుడి ట్యాలెంట్ పై నమ్మకం ఉన్నా.. ప్రస్తుతం మళ్లీ తాను హిట్ ట్రాక్ ఎక్కిన తర్వాత ఈ ప్రాజెక్టు సంగతి ఆలోచిద్దామని విక్రమ్ కు కుమార్ కు తేల్చి చెప్పేశాడట నాని.