Begin typing your search above and press return to search.

నాని చేస్తున్న క్రికెటర్ పాత్ర అతనిదా ?

By:  Tupaki Desk   |   3 Jan 2019 6:36 AM GMT
నాని చేస్తున్న క్రికెటర్ పాత్ర అతనిదా ?
X
గత ఏడాది న్యాచురల్ నానికి అంతగా అచ్చిబాటు కాలేదు. అందుకే కొత్త ఉత్సాహంతో వెరైటీ కాన్సెప్ట్స్ తో వస్తున్నాడు. రొటీన్ ట్రాక్ లోకి వెళ్లడం ఎంత ప్రమాదమో కృష్ణార్జున యుద్ధంతో పాటు దేవదాస్ లు కూడా రుజువు చేసాయి. అందుకే ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ విషయంలో ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న జెర్సి లో నాని క్రికెటర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీని తాలూకు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. నిజానికి ఫలానా క్రికెటర్ బయోపిక్ అని కానీ లేదా స్ఫూర్తి అని కానీ యూనిట్ ఎక్కడా చెప్పడం లేదు.

90ల నేపథ్యంలో సాగే ఒక క్రికెటర్ లైఫ్ ని ఇందులో చూపించబోతున్నామని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెబుతున్నాడు. ఇందులో కీ పాయింట్ గురించి నాని ఇటీవలే ఓ ట్వీట్ చేసాడు. 36 ఏళ్ళ వయసులో కొత్తగా రుజువు చేయడానికి ఏమి లేని ఒక యువకుడు 1996-97 రంజీ ట్రోఫీ ద్వారా తానేంటో మళ్ళి ప్రపంచానికి చాటాడని అందులో పేర్కొన్నాడు. అది జెర్సిలో తన పేరైన అర్జున్ పాత్ర అని చెప్పుకున్నాడు నిజానికి నాని చెప్పిన పోలిక అప్పట్లో సంచలన స్టార్ గా పేరున్న రమణ్ లాంబా గురించే అని టాక్.

అప్పట్లోని క్రికెట్ ప్రేమికులకు ఇతను బాగా గుర్తు. దేశవాళీ క్రికెట్ లో 87 మ్యాచులు ఆడిన రమణ్ లాంబా 22 సెంచరీలు 5 డబుల్ సెంచరీలు కూడా సాధించాడు. 1996-97లో తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల మధ్య రంజీలో పరుగుల సునామి సృష్టించి ఇండియన్ టీమ్ కు ఎంపికయ్యాడు. తరువాత నాలుగు టెస్టులు 32 వండేలలో ఇతని భాగస్వామ్యం ఉంది. ట్రాక్ రికార్డు కంటే ఎమోషనల్ గా లాంబా జర్నీ అద్భుతంగా ఉంటుంది. అందుకే గౌతమ్ దీన్ని ఎంచుకున్నట్టు తెలిసింది. ఏప్రిల్ లో విడుదల కానున్న జెర్సి నానికి రెండో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ. స్టార్ కాకముందే భీమిలి కబడ్డీ జట్టు చేసాడు కానీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు.