Begin typing your search above and press return to search.

విలన్ పాత్ర చేయాల్సిందే అంటున్న నాని

By:  Tupaki Desk   |   16 Feb 2016 7:00 PM IST
విలన్ పాత్ర చేయాల్సిందే అంటున్న నాని
X
కెరీర్లో ఇప్పటిదాకా రకరకాల పాత్రలు పోషించాడు యువ కథానాయకుడు నాని. సడెన్ గా ఇప్పుడతడికి విలన్ పాత్రల మీదికి మనసు మళ్లింది. లేడీ ఫాలోయింగ్ పెంచుకోవాలంటే విలన్ పాత్రలు చేయడమే మార్గం అని సెలవిస్తున్నాడు నాని. అమ్మాయిలు ఈ రోజుల్లో చాలా వైల్డ్ గా ఆలోచిస్తున్నారని.. విలన్ పాత్రలు వేస్తేనే వాళ్లను ఆకట్టుకోగలమని అంటూ.. దీనికో ఉదాహరణ కూడా చెప్పాడు నాని.

‘‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాను విడుదలకు ముందే కొందరికి ప్రివ్యూలు వేశాం. ఓ కార్పొరేట్ సంస్థకు సంబంధించిన వాళ్లు సినిమా చూశారు. వాళ్లకు సినిమా బాగా నచ్చుతుందని అనుకుంటూ బయట నిలబడ్డాం. రాగానే నన్ను అభినందిస్తారని అనుకున్నా. కానీ పోష్ గా ఉన్న నలుగురు అమ్మాయిలు బయటికి వచ్చి.. ఆ హీరోయిన్ అన్నగా చేసిన యాక్టర్ ఎవరు.. భలే చేశారని అన్నారు. అమ్మాయిలు ఇంత వైల్డ్ గా ఆలోచిస్తారా అనిపించింది. శత్రు లాగే నేను కూడా ఇక నెగెటివ్ క్యారక్టర్స్ చేసి అమ్మాయిల ఫాలోయింగ్ పెంచుకోవాలని ఫిక్సయ్యా’’ అని చమత్కరించాడు నాని.

శత్రు గురించే కాక పృథ్వీ గురించి కూడా ఓ ఆసక్తికర విషయం చెప్పాడు నాని. ‘‘భ్రమరాంభ థియేటర్ లో జనాల మధ్య షో చూద్దామని వెళ్లాం. ఇంటర్వెల్ తర్వాత సైలెంటుగా థియేటర్ లోకి వెళ్దామని డోర్ తెరుస్తుంటే జనాలు విపరీతమైన గోల చేస్తున్నారు. తెర మీద నన్ను చూసే అరుస్తున్నారనుకున్నా. కానీ అక్కడ పృథ్వీ గారు కనిపిస్తున్నారు. అప్పుడర్థమైంది జనాల్లో ఆయనకు ఎంత క్రేజ్ ఉందనేది’’ అని నాని వెల్లడించాడు.