Begin typing your search above and press return to search.

#2020 శుభారంభం 'వీ' కి క‌లిసొస్తుందా?

By:  Tupaki Desk   |   15 Jan 2020 1:30 AM GMT
#2020 శుభారంభం వీ కి క‌లిసొస్తుందా?
X
2020 ఓపెనింగ్ అదిరింది. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో మ‌హేష్‌.. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో బ‌న్ని శుభారంభాన్ని ఇచ్చారు. చ‌క్క‌ని ఓపెనింగ్ క‌లెక్ష‌న్ల‌తో శుభారంభం ప‌లికారన్న టాక్ వ‌చ్చింది. సంక్రాంతి బ‌రిలో మ‌హేష్ కి మిక్స్ డ్ టాక్ వినిపించినా బ‌న్నికి పూర్తి పాజిటివ్ టాక్ ద‌క్కింది. సంక్రాంతి సెల‌వులు కావ‌డంతో ఓపెనింగుల ప‌రంగా ఇద్ద‌రికీ డోఖా లేదు. రెండు సినిమాలు ఇప్ప‌టివ‌ర‌కూ బాక్సాఫీస్ వ‌ద్ద బ్యాలెన్సింగ్ గానే వ‌సూళ్లు ద‌క్కాయి. భోగి-సంక్రాంతి-క‌నుమ పండ‌గ‌ల‌కు క‌లెక్ష‌న్లు స్ట‌డీగా ఉంటాయ‌నే ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. ఈ నేప‌థ్యంలో రెండు సినిమాల‌కు ప‌రిశ్ర‌మ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

తాజాగా నేచుర‌ల్ స్టార్ నాని సంక్రాంతి సినిమాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించారు. నాని మాట్లాడుతూ.. ఓపెన‌ర్లు అద‌ర‌గొట్టారంటూ ప్ర‌శంసించాడు. ఏడాది ఆరంభంలో రెండు పెద్ద సినిమాలు స‌క్సెస్ అవ్వ‌డం.. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్తు సాధించ‌డం చూస్తుంటే ఈ ఏడాది గొప్ప‌గా ఉంటుంద‌ని ఆశిద్దాం అన్నాడు. త‌ర్వాత రిలీజ్ అయ్యే చిత్రాల‌కు ఈ స‌క్సెస్ లు బాస‌ట‌గా నిల‌వాలి అని ఆకాంక్షించాడు. రెట్టించిన ఉత్సాహంతో స‌మ్మ‌ర్ త‌ర్వాత కాలంలో విడుద‌ల‌య్యే చిత్రాలు మంచి విజ‌యాలు న‌మోదు చేయాల‌ని కోరుకున్నాడు. ఈ రెండు విజ‌యాల‌తో ప‌రిశ్ర‌మ స‌హా పంపిణీదారులు...ఎగ్జిబిట‌ర్లు సంతోషంగా ఉండాలన్న‌దే నాని ఆకాంక్ష‌.

కొత్త వాళ్లు ప‌రిశ్ర‌మ‌కు రావాలంటే ఈ విజ‌యాలే కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని నేచుర‌ల్ స్టార్ తెలిపాడు. అన్ని ప్ర‌స్తుతం నాని క‌థానాయ‌కుడిగా ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ `వీ` చిత్రాన్నితెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణ క్లైమాక్స్ లో ఉంది. ఉగాది కానుకగా మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. వీ లో నాని ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టిస్తుండ‌గా సుధీర్ బాబు కాప్ రోల్ పోషిస్తున్నారు.