Begin typing your search above and press return to search.

నాని నిజంగా ఒప్పుకుంటాడా?

By:  Tupaki Desk   |   21 Oct 2018 6:25 AM GMT
నాని నిజంగా ఒప్పుకుంటాడా?
X
న్యాచురల్ స్టార్ నానికి ఈ ఏడాది పెద్దగా అచ్చిబాటు రాలేదు. కృష్ణార్జున యుద్ధం కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ గా మిగలగా మల్టీ స్టారర్ గా ఎంతో ఆశ పెట్టుకున్న దేవదాస్ పబ్లిసిటీలో మాత్రమే హిట్ అనిపించుని థియేటర్ల దగ్గర మాత్రం తేడా కొట్టింది. ఇక కొత్త అనుభవం కోసం ప్రయత్నించిన బిగ్ బాస్ 2 యాంకరింగ్ పేరు కంటే ట్రాలింగ్ ని ఎక్కువ మోసుకొచ్చింది. అందులో నాని ప్రమేయం లేకపోయినా అవసరం లేని వివాదాలు తననూ ఇబ్బంది పెట్టాయి. అం

దుకే ఇప్పుడు తన పూర్తి ఫోకస్ జెర్సీ మీదే పెడుతున్నాడు. మళ్ళి రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కోసం నాని నిజంగానే క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇక ఇది కాకుండా నాని మరో ప్రాజెక్ట్ ఒప్పుకున్న సమాచారం అయితే లేదు. కానీ దిల్ రాజు చాలా ఇష్టపడి కొనుకున్న తమిళ హిట్ 96 రీమేక్ లో నటించేందుకు నాని సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వస్తున్న వార్తలు అభిమానుల్లో కొంత సంతోషానికి కొంత అయోమయానికి గురి చేస్తున్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. ఇంతకు ముందే చెప్పినట్టు 96 ఒక మంచి ఫీల్ గుడ్ మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ. అలాంటి కథను నాని ఎంతవరకు ఒప్పుకుంటాడు అనే విషయంలో ఇంతకు ముందే చర్చ జరిగింది. పైగా క్లైమాక్స్ కమర్షియల్ సూత్రాలకు భిన్నంగా ఉంటుంది. సినిమా అయితే నాని చూసాడు కాని నిజంగా మనసులో ఈ రోల్ చేయాలా వద్దా అనే క్లారిటీ అయితే ప్రస్తుతానికి ఉన్నట్టు లేదు.

96 ఈ ఏడాది వచ్చిన టాప్ హిట్స్ లో ఒకటిగా కోలీవుడ్ లో సంచలనం రేపింది. కర్ణాటకలో డబ్బింగ్ చేయకుండా కేవలం ఒరిజినల్ వెర్షన్ హక్కులను 35 లక్షలకు అమ్మితే ఏకంగా 1 కోటి 65 లక్షలు వసూలు చేసి ఔరా అనిపించింది. భాషలకు అతీతంగా ఈ స్థాయిలో విజయం సాధించింది కాబట్టే దిల్ రాజు క్రేజీ కాంబోలో రీమేక్ చేయాలనీ పట్టుదలతో ఉన్నాడు. సామ్ నో చెప్పిన నేపధ్యంలో త్రిషనే ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి నానినా ఇంకో హీరోనా తేలాలంటే ఇంకొద్ది రోజులు పడుతుంది.