Begin typing your search above and press return to search.
బాలయ్యని నిర్లక్ష్యం చేస్తున్న నాని
By: Tupaki Desk | 4 Feb 2016 9:39 AM ISTచిన్న సినిమాల్లో స్టార్ హీరోల ఇమేజ్ ని ఉపయోగించుకోవడం, పెద్ద హీరోల ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు వారిని పొగుడుతూ డైలాగ్స్ పెట్టడం, కొన్ని సీన్స్ ని దింపేయయం చూస్తుంటాం. ఇంకొన్ని పారడీ చేసో - స్పూఫ్ లతోనో బడా హీరోల అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు మేకర్స్. కానీ నాని మాత్రం బాలయ్యను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
హను రాఘవపూడి డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ఫిబ్రవరి 12న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో బాలయ్యకు వీరాభిమానిగా నాని నటిస్తున్నాడు. అంతే కాదు.. చేతిమీద జై బాలయ్య అని టాటూ కూడా వేయించుకునే రోల్ ఇది. సినిమా షూటింగ్ స్టార్టింగ్ చేసినపుడు.. ఇదే బాగా హైలైట్ అయింది. బాలయ్యను నాని బాగా ఉపయోగించుకుంటున్నాడని, నందమూరి ఫ్యాన్స్ ని ఇలా ఆకట్టుకుంటున్నాడని అన్నారు.
ఓ సమయంలో అయితే ఈ మూవీకి జై బాలయ్య అనే టైటిల్ నే ఫిక్స్ చేస్తారనే వార్తలొచ్చాయి. కానీ ఈ మూవీ యూనిట్ మాత్రం కృష్ణగాడి వీరప్రేమగాధకు సెట్ అయ్యారు. ఆ తర్వాత నాని ఎక్కడా బాలయ్యను ప్రస్తావించడం లేదు. పోస్టర్లు - ట్రైలర్లు - టీజర్లు - ప్రమోషన్.. ఇలా ఎక్కడా బాలకృష్ణ పేరు కూడా ఉపయోగించకుండానే పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఓ పెద్ద హీరోని సినిమా స్టోరీలో భాగం చేసినా, ఇలా కనీసం కూడా పేరు ఉపయోగించకుండా పబ్లిసిటీ చేస్తుండడంతో.. కృష్ణగాడి వీర ప్రేమ గాధ యూనిట్ ఆంతర్యం అర్ధం కాకుండా ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు.