Begin typing your search above and press return to search.

పది రోజుల్లో పాతిక కోట్లు పట్టేశాడు

By:  Tupaki Desk   |   18 July 2017 11:11 AM GMT
పది రోజుల్లో పాతిక కోట్లు పట్టేశాడు
X
క్లాస్ సినిమాతో వస్తున్నాడు.. ఇంటెన్స్ లవ్ స్టోరీ అంటున్నాడు.. ఈసారికి వసూళ్ల మోత కష్టమే అనుకున్నారు నాని కొత్త సినిమా ‘నిన్ను కోరి’ విషయంలో. కానీ ఇలాంటి సినిమాతో కూడా అదిరిపోయే వసూళ్లు రాబడుతున్నాడు నాని. తొలి వారాంతంలోనే రూ.16 కోట్ల దాకా షేర్ సాధించిన ఈ సినిమా.. సెకండ్ వీకెండ్ అయ్యేసరికి రూ.25 కోట్ల షేర్ మార్కును దాటేయడం విశేషం. తొలి పది రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.25.25 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. గ్రాస్ రూ.46 కోట్లు దాటింది. ఫుల్ రన్లో ఈ చిత్ర షేర్ రూ.35 కోట్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టయిన ‘నేను లోకల్’ కూడా అంతే షేర్ వసూలు చేసింది.

తొలి పది రోజుల్లో ఏరియాల వారీగా ‘నిన్ను కోరి’ షేర్స్ వివరాలు..

నైజాం-రూ.8.32 కోట్లు

వైజాగ్ (ఉత్త‌రాంధ్ర‌)-రూ.2.81 కోట్లు

సీడెడ్‌ (రాయలసీమ)-రూ.2.44 కోట్లు

తూర్పు గోదావ‌రి-రూ.1.65 కోట్లు

ప‌శ్చిమ‌గోదావ‌రి-రూ.1.07 కోట్లు

గుంటూరు-రూ.1.34 కోట్లు

కృష్ణా- రూ.1.37 కోట్లు

నెల్లూరు-రూ.55 లక్షలు

ఏపీ-తెలంగాణ షేర్- రూ.19.55 కోట్లు

యుఎస్- రూ.3.24 కోట్లు

కర్ణాటక-రూ.1.61 కోట్లు

మిగతా ఏరియాల్లో- రూ.85 లక్షలు

వరల్డ్ వైడ్ షేర్- రూ.25.25 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్- రూ.46.1 కోట్లు