Begin typing your search above and press return to search.

నానితో పూర్తి వినోదభరిత సినిమా తీస్తానంటున్న డైరెక్టర్ వివేక్

By:  Tupaki Desk   |   6 May 2020 2:30 AM GMT
నానితో పూర్తి వినోదభరిత సినిమా తీస్తానంటున్న డైరెక్టర్ వివేక్
X
వరుస హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని ప్రస్తుత సినిమాల విడుదల తేదీలను వాయిదా వేసే పనిలో పడ్డారట. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే వి సినిమా విడుదల ఆపేసి ఇంట్లో ఉంటున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన తదుపరి సినిమా 'టక్ జగదీశ్' గురించి కూడా తెలిపాడు నాని. నిన్ను కోరి సినిమాతో హిట్ అందించిన శివా నిర్వాణ దర్శకత్వంలోనే టక్ జగదీష్ రూపొందుతుంది. హరీష్‌ పెద్ది, సాహు గారపాటి, షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూన్ లో విడుదల చేస్తామని అప్పట్లో చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో నానికి జంటగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు.

హీరోయిన్ రీతూవర్మ తో పాటు మరో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్నారు. తమన్‌ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. ఇటీవల గ్యాంగ్‌ లీడర్‌ సినిమాతో హిట్ కొట్టిన నాని తాజాగా వి సినిమాను రిలీజ్ చేద్దామని రెడీ అయ్యాడు. సుధీర్‌ బాబు, నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘టక్‌ జగదీష్‌’ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో శ్యామ్‌ సింగ రాయ్‌ సినిమాను అనౌన్స్‌ చేశాడు నాని. అయితే తాజాగా మరో క్రేజీ సినిమాకు నాని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ‘బ్రోచేవారెవరురా’తో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు కమిట్‌ అయినట్టు సమాచారం. వివేక్‌ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో అతడితో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వివేక్‌ పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో పడ్డాట. అయితే ఈ చిత్రాన్ని పూర్తి వినోదభరితంగా తెరకెక్కించాలని వివేక్‌ భావిస్తున్నాడట. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనుందట. అన్నీ కుదిరితే ‘నాని గ్యాంగ్‌ లీడర్‌’ తర్వాత మైత్రి నిర్మాణ సంస్థలో నాని చేయబోతున్న సినిమా ఇదే కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.