Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: నాని తెప్పించే తలనొప్పి..
By: Tupaki Desk | 15 Jan 2017 12:58 PM ISTవిభిన్నమైన కథనాలు ఎంచుకోవడంలో న్యాచురల్ స్టార్ నానికి సాటిరారెవ్వరు. కాకపోతే మనోడు మాస్ కు దగ్గరగా ఉండే సినిమాలు మాత్రం పెద్దగా చేయట్లేదు. అందుకే ఇప్పుడు ఆ లోటు తీర్చేయడానికి ''నేను లోకల్'' సినిమాతో దిగిపోతున్నాడు.
సినిమా చూపిస్తా మావా ఫేం నక్కిన త్రినాథ రావు డైరక్షన్లో ఇప్పుడు హీరో నాని వచ్చేస్తున్నాడు. వీరు తీసిన నేను లోకల్ సినిమా ట్రైలర్ నిన్న రిలీజైంది. ఆద్యంతం వినోద్మాతకంగా సాగే ఈ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. కాలేజీకి వెళ్ళి కేవలం చదువుకోవడమే కాకుండా.. ఒక అమ్మాయిని ప్రేమించే యువకుడు 'బాబు' పాత్రలో నాని రక్తి కట్టించేశాడు. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా మరోసారి తన టాలెంట్ తో ఆకట్టుకుంది. 'వీడు మాములోడు కాదే. జండూబామ్‌కు కూడా తలనొప్పి తెప్పించే రకం' అంటూ నాని మీద హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ వేసే పంచ్ తో.. తెగ నవ్వులొచ్చేస్తాయి. అలాగే 'పరిగెత్తి.. పరిగెత్తి బతికేదానిని జింకా అంటారు. ఆగి.. ఆగి.. కొట్టేదాన్ని పులి అంటారు' అంటూ నాని ఒక మాస్ డైలాగ్ ను పేల్చడం చూస్తే.. సినిమా ఏ లెవెల్లో ఉండబోతోందో అర్ధమైపోతుందిలే.
అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందంచిన మ్యూజిక్ కూడా సినిమాకు పెద్ద ఎస్సెట్ అనే చెప్పాలి. చూస్తుంటే ఫిబ్రవరిలో రిలీజయ్యే ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజు మరో హిట్టు కొట్టేశేలా ఉన్నాడు.