Begin typing your search above and press return to search.

సాంగ్ టాక్‌: నాని.. నెక్ట్స్ ఏంటమ్మా??

By:  Tupaki Desk   |   12 Jan 2017 5:21 PM GMT
సాంగ్ టాక్‌: నాని.. నెక్ట్స్ ఏంటమ్మా??
X
హీరో నాని ఇప్పుడు ''నేను లోకల్'' సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మనోడు కూడా మెగా మూవీస్ అయిన సరైనోడు అండ్ ఖైదీ నెం 150 తరహాలో రెండు మూడురోజులకో పాటను రిలీజ్ చేసి రచ్చ చేయనున్నాడు. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ''నెక్ట్స్ ఏంటి?'' అనే పాటను రిలీజ్ చేశాడు. పదండి ఈ సాంగ్ ఎలా ఉందో.

దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పెప్పీ సాంగ్ ను తమ్ముడు సాగర్ ఆలపించాడు. మాంచి యూత్ ఫుల్ సాంగ్ అనే చెప్పాలి. అయితే ట్యూన్ పరంగా ఎప్పుడో చాలాసార్లు విన్నట్లు అనిపించవచ్చేమో కాని.. లిరిక్స్ పరంగా కాస్త థాట్ ఫుల్ గా ఉంది. బిఏ చేసినా ఎం.ఎ చేసినా కూడా అందరూ నెక్ట్స్ ఏంటి? అంటూ ఫ్యూచర్ గురించి అడుగుతుంటారు. ఇలాంటి సిట్యుయేషన్లు తీసుకుని.. మనోడు ఈ సాంగ్ క్రియేట్ చేశాడు. వినగా వినగా పాటలోని ఆ కామిక్ టచ్ లిరిక్స్ బాగా నచ్చేస్తాయిలే.

ఇకపోతే ఈ పాట వింటుంటే మాత్రం.. నాని చాలారోజుల తరువాత మాంచి యూత్‌ ఫుల్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడని అనుకోవచ్చేమో. మొన్నామధ్యన సినిమా చూపిస్తామావ సినిమాతో భారీ హిట్టు కొట్టేసిన నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు డైరక్టర్. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/