Begin typing your search above and press return to search.

వెంకీ.. నాగ్.. మధ్యలో లోకల్ హీరో

By:  Tupaki Desk   |   20 Dec 2016 7:52 AM GMT
వెంకీ.. నాగ్.. మధ్యలో లోకల్ హీరో
X
2016వ సంవత్సరం నానికి కలిసొచ్చినంతగా వేరే ఏ హీరోకి రాలేదేమో. వరుసగా మూడు సినిమాలు రిలీజ్ చేసేసి.. అన్నిటితోను హిట్ కొట్టేశాడు. క్రిస్మస్ నాటికి నాలుగో మూవీగా 'నేను లోకల్' చేసేద్దామని అనుకున్నాడు కానీ.. ఇంకా షూటింగ్ పార్ట్ చాలా పెండింగ్ లో ఉండడంలో సాధ్యమయ్యే పని కాదని ఇప్పటికే తేలిపోయింది. డిసెంబర్ 23న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాని ఇప్పుడు ఫిబ్రవరి వరకూ పోస్ట్ పోన్ చేసేశారని తెలుస్తోంది.

ఈ మధ్యలోనే షూట్ కంప్లీట్ అయినా.. తను నిర్మిస్తున్న శతమానం భవతి.. నేను లోకల్ ల మధ్య మినిమం గ్యాప్ ఉండాలని భావించాడట నిర్మాత దిల్ రాజు. అందుకే నాని-కీర్తి సురేష్ లు నటించిన నేను లోకల్ ను ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యాడట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఏడాది రిలీజ్ లలో పెద్ద పోటీ లేని టైమ్ లో వచ్చి మంచి హిట్స్ కొట్టిన నానికి.. తాజా రిలీజ్ డేట్ కారణంగా.. సీనియర్ హీరోలతో పోటీ తప్పదని తేలిపోయింది.

జనవరి ఆఖరి వారంలో వెంకటేష్ మూవీ గురు రిలీజ్ కానుంది. ఫిబ్రవరి రెండో వారంలో నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఓం నమో వెంకటేశాయ విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ డేట్స్ లాక్ అయిపోగా.. ఈ నేను లోకల్ కుర్రాడయిన నాని మధ్యలో వచ్చి సత్తా చూపించాలన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/