Begin typing your search above and press return to search.

నాని సింగిల్ షాట్ కి రెడీయేనా

By:  Tupaki Desk   |   11 Nov 2016 4:14 AM GMT
నాని సింగిల్ షాట్ కి రెడీయేనా
X
గత రెండు సంవత్సరాలుగా యంగ్ హీరో నానికి పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ టాలీవుడ్ యువహీరోలలొ మోస్ట్ బ్యాంకబుల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడు నానితో సినిమా అంటే కాసుల పంటగా భావిస్తున్నారు నిర్మాతలు.

ఈ క్రమంలో విడుదలకు దగ్గరవుతున్న నాని తాజా చిత్రం నేను లోకల్ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ అలరించిన సంగతి తెలిసినదే. పక్కా మాస్ గెట్ అప్ లో నాని చాన్నాళ్ళ తరువాత దర్శనమిచ్చాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ త్వరలో విడుదలకానున్నట్టు సమాచారం.

అయితే ఈ టీజర్ కి ఒక విశిష్టత వుంది. 28 సెకన్ల నిడివిగల ఈ టీజర్ ని సింగిల్ షాట్ లో తీసారట. ప్రేక్షకుడికి ఇదొక కొత్త అనుభూతి అని చిత్ర వర్గాలు తెలుపడం విశేషం. నాని నటించిన అలా మొదలైంది క్లైమాక్స్ షాట్ సింగిల్ షాట్ లో తీసిందే. అది మంచి ఆదరణ పొందింది. అదీకాక సెకండ్ హ్యాండ్ అనే సినిమాలో ఏకంగా ఒక పాటంతా సింగిల్ షాట్ లో తీశారు. తాజా సంచలనం సంపూర్ణేష్ బాబు రీసెంట్ ట్రైలర్ లో ఫుల్ లెంగ్త్ డైలాగ్ సింగిల్ షాట్ లో వున్నదే. ఈ వరుసలో నాని టీజర్ కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం. ''

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/