Begin typing your search above and press return to search.

నాని థ్రిల్ చేయబోతున్నాడా?

By:  Tupaki Desk   |   19 April 2018 10:07 AM IST
నాని థ్రిల్ చేయబోతున్నాడా?
X
వరస హిట్లతో మంచి జోష్ మీదున్న నానికి లేటెస్ట్ సినిమా కృష్ణార్జున యుద్ధం బ్రేకులేసింది. డబుల్ యాక్షన్ తో మెప్పిస్తాడనుకున్న నాని ప్రేక్షకులను నీరసపరిచాడు. దీంతో తాజాగా ఓ కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈసారి థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేసి మెప్పించాలని ప్లాన్ చేస్తున్నాడు.

నాని కెరీర్ లో ఇంతవరకు రకరకాల పాత్రలు చేసినా పుల్ లెంగ్త్ థ్రిల్లర్ సినిమా చేయలేదు. కమర్షియల్ సినిమాలకు డిఫరెంట్ టచ్ ఇచ్చి మెప్పించే డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ రీసెంట్ అతడికి గా ఓ థ్రిల్లర్ కథ వినిపించాడని తెలుస్తోంది. హలో సినిమాతో ఆశించిన ఫలితం పొందలేకపోయిన విక్రమ్ కాస్తంత గ్యాప్ తీసుకుని ఓ థ్రిల్లర్ కథతో స్ర్కిప్ట్ సిద్ధం చేశాడట. ఈ కథకు నాని సూటవుతాడనే ఉద్దేశంతో అతడికే ముందుగా వినిపించాడు. కథ బాగా నచ్చడంతో నాని సినిమా చేయడానికి ఓకే చెప్పాడనేది లేటెస్ట్ టాక్.

ప్రస్తుతం నాని శ్రీరామ్ ఆది త్య డైరెక్షన్ లో నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. మల్టీస్టారర్ మూవీ కావడంతో డేట్స్ మార్చడం కష్టం. కాబట్టి ఇది పూర్తయ్యాకే విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ లో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.