Begin typing your search above and press return to search.

జోరందుకున్న నాని.. ఆగేలా లేడు

By:  Tupaki Desk   |   30 Sep 2015 1:30 PM GMT
జోరందుకున్న నాని.. ఆగేలా లేడు
X
టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ యంగ్ హీరోల్లో నాని ఒకడు. కానీ అతను లాస్ట్ ఇయర్ వరుసగా రెండు ఫ్లాపులిచ్చేసరికి అల్లకల్లోలం అయిపోయింది. ఇక నాని పనైపోయిందన్నట్లు సీన్ క్రియేట్ చేశారు. కానీ ఈ సంవత్సరం నాని జోరు మామూలుగా లేదు. ఇప్పటికే మూడు సినిమాలు రిలీజయ్యాయి. అందులో ‘భలే భలే మగాడివోయ్’ బ్లాక్ బస్టర్ రేంజికి చేరింది. ‘ఎవడే సుబ్రమణ్యం’ కూడా హిట్ అయింది. ‘జెండాపై కపిరాజు’ విడుదల కావడమే నానికి పెద్ద సంతోషం.

భలే భలే.. అనూహ్యమైన వసూళ్లు సాధిస్తుండటంతో నాని రేంజే మారిపోయింది. అతడి కోసం చాలామంది నిర్మాతలు, దర్శకులు క్యూలో ఉన్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రాజెక్టుల్లో ఆచితూచి ఎంచుకుంటున్నాడు నాని. ‘భలే భలే..’ రావడానికి ముందే హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ నిర్మాణంలో నాని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

తాజాగా నాని రెండు సినిమాలు కమిటయ్యాడు. తనను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఇప్పుడు కొంచెం కష్టాల్లో ఉండటంతో గురువును గట్టెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు నాని. నిర్మాత ఎవరన్నది తేలాల్సి ఉంది కానీ.. నాని, ఇంద్రగంటి కాంబినేషన్లో సినిమా మాత్రం ఖాయం. ఆ సినిమాలో బీరువా ఫేమ్ సురభితో పాటు మలయాళ నటి నివేద థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు జ్నాపకం - స్నేహగీతం లాంటి సినిమాల్లో హీరోగా నటించిన వెంకీ అనే కుర్రాడి దర్శకత్వంలోనూ నాని ఓ సినిమా చేయబోతుండటం విశేషం. ఇంకో రెండు సినిమాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.