Begin typing your search above and press return to search.

నానితో పోటీ పడబోతున్న వారసులు

By:  Tupaki Desk   |   6 Oct 2017 9:44 AM GMT
నానితో పోటీ పడబోతున్న వారసులు
X
న్యాచురల్ స్టార్ నానికి ప్రస్తుతం మహార్ధశ నడస్తోంది. పట్టిందల్లా బంగారం అనే రీతిన నాని నటించిన సినిమాలు జనాలకి విపరీతంగా నచ్చేస్తున్నాయి. మినిమమ్ గ్యారెంటీ హీరో అనే బ్రాండ్ నేమ్ ను కాస్తా మినిమమ్ హిట్ హీరో అనే రేంజ్ కి తెచ్చేసుకున్నాడు. ప్రస్తుతం నాని ఎమ్ సి ఏ - కృష్ణార్జుణ యుద్ధం అనే సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఈ రెండిట్లో ఎమ్ సి ఏ ముందుగా విడుదల కాబోతుంది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసంబర్ 22న ఎమ్ సి ఏ ని విడుదల చేసేందుకు నాని ప్లాన్ చేసుకుంటున్నాడు అయితే ఇదే టైమ్ కి ఈ న్యాచురల్ స్టార్ కి పోటీగా పరిశ్రమకు చెందిన రెండు ప్రముఖ ఫ్యామిలీలకు చెందన నట వారసలు ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. అందులో ముందుగా నందమూరి ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ రామ్ తన అప్ కమింగ్ మూవీ ఎమ్ ఎల్ ఏ ను క్రిస్మస్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు.

మరో వైపున అక్కినేని బుల్లోడు అఖిల్ కూడా తన రెండో సినిమా హలో ని డిసెంబర్ 22నే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అఖిల్ డెబ్యూ మూవీ ఫ్లాప్ అవ్వడంతో చాలా గ్యాప్ తీసుకొని హలో ని కమిటైన సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని డీల్ చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో హలో తెరకెక్కుతుందని తెలిసింది. ఇక కళ్యాణ్ రామ్ కూడా ఎమ్ ఎల్ ఏ గా హిట్ కొట్టాలనే కసిలో ఉన్నట్లుగా తెలిసింది. ఓ మంచి మాస్ మసాలా స్టోరీతో ఎమ్ ఎల్ ఏ తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరికి ధీటుగానే నాని సినిమా ఎమ్ సి ఏ ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థుతులు బట్టి ట్రేడ్ వర్గాలు కూడా అఖిల్ - కళ్యాణ్ రామ్ సినిమాలు కంటే ప్రేక్షకులు నాని సినిమాకే ఎక్కువుగా మెగ్గు చూపే అవకాశం ఉందని, కానీ ఈ మూడు భారీ సినిమాలు ఒకే రోజు బరిలోకి దిగేకంటే ఓ వారం వ్యవధిలో విడుదల చేస్తే అంతా సేఫ్ అవుతారని సినీజనాలు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!