Begin typing your search above and press return to search.

టాలీవుడ్ సెకండ్ లీగ్ హీరోలలో సింహాసనం ఎవరిది?

By:  Tupaki Desk   |   9 Aug 2019 8:00 PM IST
టాలీవుడ్ సెకండ్ లీగ్ హీరోలలో సింహాసనం ఎవరిది?
X
ఏ బాషా సినిమా అయినా పరిశ్రమ మనుగడ హీరోల ఇమేజ్ మీద మార్కెట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది కాదనలేని సత్యం. కాకపొతే ఎవరి స్థాయికి తగ్గట్టు అందరికి ఒకే తరహా బిజినెస్ జరగడం ఉండదు. అందుకే సాదారణంగా మనకు మూడు రకాల క్యాటగిరీలలో హీరోలు తన కెరీర్ ని సాగిస్తూ ఉంటారు. ఫస్ట్ లీగ్ అంటే టాప్ రోలో మహేష్ బాబు - ప్రభాస్ - రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ - అల్లు అర్జున్ ;లాంటి వాళ్ళన్న మాట.

కేవలం వీళ్ళ పేరు మీదే బిజినెస్ జరిగిపోతుంది. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కి మినిమం గ్యారెంటీ ఉంటుంది.థర్డ్ లీగ్ లో అప్ కమింగ్ యూత్ హీరోలను వేసుకోవచ్చు. వీళ్ళకు హిట్ వస్తేనే లెక్క. ఓ రెండు మూడు సినిమాలు పోయాయంటే ఫ్యూచర్ డైలమాలో పడిపోతుంది. ఇక్కడ మన టాపిక్ ఈ రెండింటి మధ్య కీలకంగా నిలిచే సెకండ్ లీగ్ హీరోలు.

తుపాకీ సైట్ ప్రత్యేకంగా నిర్వహించిన సర్వే ఎవరు టాప్ ప్లేస్ లో ఉన్నారనే విషయం తెలుసుకోవడానికి సినిమా ప్రేమికులు అభిమానుల నుంచి ఆన్ లైన్ పోలింగ్ రూపంలో అభిప్రాయ సేకరణ జరిపింది. అందులో నాని అత్యధిక శాతం ఓట్లతో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా గత రెండుమూడేళ్ళుగా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ భారీ వ్యత్యాసంతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరసగా వరుణ్ తేజ్ - శర్వానంద్ - రామ్ - సాయి ధరం తేజ్ - నితిన్ లు ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా నాని ఆధిపత్యం కనిపిస్తోంది.

ఇటు ఫ్యామిలీస్ అటు యూత్ లోనూ బలమైన ఫాలోయింగ్ కలిగిన నాని ఎప్పటి నుంచో మినిమం గ్యారెంటీ హీరోగా కెరీర్ ని పీక్స్ కు తీసుకెళ్ళాడు. భలే భలే మగాడివోయ్ లాంటి ఎంటర్ టైనర్ ఆ స్థాయిలో వసూళ్లు తేవడానికి కారణం నాని టైమింగ్ అని వేరే చెప్పనక్కర్లేదు. నిన్ను కోరిలో భగ్న ప్రేమికుడి ఎమోషన్స్ జెర్సీలో తండ్రి తాపత్రయం ఎంసిఎలో సగటు మధ్యతరగతి కుర్రాడి దుడుకుతనం ఇలా రకరకాల వేరియేషన్స్ ని ఈజీగా క్యారీ చేస్తున్న నాని ఫాలోయింగ్ చిన్నదేమీ కాదు.

ఇంకొక్క బలమైన సాలిడ్ బ్లాక్ బస్టర్ స్టొరీ పడాలే కాని ఈజీగా 50 కోట్ల క్లబ్బులో చేరడం పెద్ద విషయమేమీ కాదు. ఫస్ట్ లీగ్ కు కేవలం కొద్ది అడుగుల దూరంలో ఉన్నాడన్న మాట కూడా అతిశయోక్తి కాదు. అది నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉందని అభిమానుల నమ్మకం. కథల విషయంలో వైవిధ్యం పాటిస్తున్న నాని అది చేరడం ఖాయమన్న వాళ్ళ ఆకాంక్ష తీరే రోజు దగ్గరలోనే ఉంది.