Begin typing your search above and press return to search.

జెర్సీని టెన్షన్ పెడుతున్న లెక్కలు

By:  Tupaki Desk   |   22 April 2019 5:25 AM GMT
జెర్సీని టెన్షన్ పెడుతున్న లెక్కలు
X
కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ చిత్రాలు అర్థం కావు. టాక్ ఎంత బాగా వచ్చినా రివ్యూలు సినిమాను పొగడ్తలతో ముంచెత్తినా దాని ప్రభావం కొన్నిసార్లు టికెట్ కౌంటర్ల దగ్గర కనిపించకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. చూస్తుంటే నాని జెర్సి అదే పంధాలో ఉన్నట్టు కనిపిస్తోంది. వీకెండ్ మొదటి మూడు రోజులు విపరీతమైన పాజిటివ్ పబ్లిసిటీతో హౌస్ ఫుల్స్ చేయించుకున్న జెర్సికి కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవని ట్రేడ్ రిపోర్ట్.

ఎమోషన్స్ సెంటిమెంట్స్ కి మంచి ఆదరణ ఉండే యుఎస్ లో సైతం ఇప్పటికీ 1 మిలియన్ మార్క్ చేరకపోవడం అంటే వింతే. ఈ రోజో రేపో ఆ ఫీట్ సాధ్యమయ్యేలా ఉంది. శనివారం దాకా గమనిస్తే జెర్సి 8 లక్షల మార్క్ దాటకపోవడం గమనార్హం. ఎమోషన్ ఎంత బలంగా ఉన్నా కీలకమైన ఎంటర్ టైన్మెంట్ లో జెర్సి అంతగా మెప్పించలేకపోవడం కొంత ప్రభావం చూపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం

ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం జెర్సికి భీభత్సంగా ఏమి లేదు. ఏ సెంటర్లో ధోకా లేకుండా మూడు రోజులు తన కంట్రోల్ లో తీసుకున్నప్పటికీ బిసి కేంద్రాల్లో మాత్రం అంత రెస్పాన్స్ కనిపించడం లేదని టాక్. 26 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగడంతో టార్గెట్ పెద్దగానే ఉంది. ఎంత లేదన్నా 50 కోట్ల గ్రాస్ రావాలి. అదంతా ఈజీ కాదు.

ఒకవైపు విమర్శకులు పెదవి విరిచిన కాంచన 3 బాగానే రాబడుతుండగా ఇంకో నాలుగు రోజుల్లో అవెంజర్స్ ఎండ్ గేమ్ ముంచుకొస్తోంది. ఈ నేపధ్యంలో ఇంత మంచి టాక్ ను జెర్సి నిలబెట్టుకోలేకపోతే అదో భేతాళ ప్రశ్నగా మిగిలిపోతుంది. దగ్గరలో ఇంకే సినిమాలు లేవు కాబట్టి జెర్సి ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుందో చూడాలి