Begin typing your search above and press return to search.

నాని మూవీలో హీరోయిన్ ఉంది.. కాని లవ్ ఉండదట!

By:  Tupaki Desk   |   7 Nov 2021 11:30 AM GMT
నాని మూవీలో హీరోయిన్ ఉంది.. కాని లవ్ ఉండదట!
X
నాని హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. అతి త్వరలో శ్యామ్‌ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాని ఆ తర్వాత అంటే సుందరానికి అనే సినిమాతో రాబోతున్నాడు. ఇదే సమయంలో నాని తన కొత్త సినిమా 'దసరా' ను ప్రకటించాడు. సినిమా లో కీర్తి సురేష్ కూడా నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఇంతకు ముందుగానే నాని మరియు కీర్తి సురేష్ లు కలిసి నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యి దసరా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో నాని అభిమానులు ఉన్నారు. ఈ సమయంలో సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్‌ వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దసరా సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుంది కాని ఆమెకు నానికి మద్య లవ్‌ అండ్ రొమాన్స్ ఉండదట. ఇద్దరి పాత్రలు సినిమాకు చాలా ప్రధానంగా ఉంటాయి కాని హీరో హీరోయిన్స్ గా మాత్రం వారు కనిపించబోవడం లేదు అంటున్నారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌.. కాస్త కమర్షియల్‌ ఎలిమెంట్స్ కు దూరంగా ఈ సినిమా ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న దసరా సినిమాకు సంబంధించిన ఈ విషయమై యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగు సినిమా అంటే ఖచ్చితంగా లీడ్‌ ఫేర్ మద్య లవ్‌ ఉండాలి.. రొమాన్స్ ఉండాలి. ఈమద్య ముద్దు సీన్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటిది నాని మరియు కీర్తి వంటి స్టార్స్‌ ను పెట్టి లవ్ ఉండదు అంటే ఎలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు నాని చాలా రోజులకు ఒక మంచి సబ్జెక్ట్‌ ఎంపిక చేసుకున్నట్లుగా ఉన్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సింగరేణి బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతున్న ఈ సినిమాకు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇటీవల టక్ జగదీష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఆ సినిమా తో మెప్పించలేక పోయాడు అనే టాక్ వచ్చింది. డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్ అవ్వడం వల్ల కూడా వివాదాలు వచ్చాయి. మొత్తంగా నాని వరుసగా ప్లాప్ లు చవిచూస్తున్న ఈ సమయంలో దసరా వంటి నాన్‌ కమర్షియల్‌ థ్రిల్లర్ మూవీని చేసేందుకు ఒప్పుకోవడం అంటే ఖచ్చితంగా సాహసం అని చెప్పాలి. నాని మరియు కీర్తి సురేష్‌ ల మద్య ఉండే బంధం ఏంటీ అనేది చూడాలి.