Begin typing your search above and press return to search.

మహానటి సినిమా స్పందించిన నాని

By:  Tupaki Desk   |   29 March 2017 12:14 PM GMT
మహానటి సినిమా స్పందించిన నాని
X
యంగ్ హీరో నాని ఈ ఉగాది పండుగను సూపర్ గా ఎంజాయ్ చేసేస్తున్నాడు. వరుసగా అరడజన్ సక్సెస్ లు ఎంజాయ్ చేస్తున్న నాని.. మరో వైపు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న నిన్ను కోరి చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. వీటికి తోడు.. ఉగాది పండుగ రోజు ఉదయాన్నే నాని దంపతులకు మగబిడ్డ జన్మించడంతో.. పుత్రోత్సాహం కూడా ఎంజాయ్ చేసేస్తున్నారు.

వీటితో పాటు నానిపై కొన్ని రోజులుగా ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ కూడా ఆసక్తిగా గమనిస్తున్న సావిత్రి బయోపిక్ మహానటిలో నాని ఓ పాత్ర పోషిస్తున్నాడనే రూమర్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మహానటిలో రోల్ కోసం అడగడం.. నాని సైన్ చేసేశాడని కూడా చెప్పేస్తున్నారు. ఈ విషయం పైనే ఇప్పుడు నాని క్లారిటీ ఇచ్చాడు. ఓ న్యూస్ పేపర్ ఆర్టికల్ కు సోషల్ మీడియా ద్వారా రిప్లై ఇచ్చిన నాని.. ఈ న్యూస్ నిజం కాదని స్పష్టం చేశాడు.

అయితే.. మహానటిలో నటిస్తున్నారంటూ.. నానితో పాటు మరో యంగ్ హీరో శర్వానంద్ పేరు కూడా వినిపిస్తోంది కానీ.. శర్వా ఈ విషయంపై ఇంకా రియాక్ట్ కాలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/