Begin typing your search above and press return to search.

క్యూటెస్ట్ ఆంథాలజీగా నాని 'మీట్ క్యూట్'..!

By:  Tupaki Desk   |   5 Aug 2021 7:35 AM GMT
క్యూటెస్ట్ ఆంథాలజీగా నాని మీట్ క్యూట్..!
X
'వాల్‌ పోస్ట‌ర్ సినిమా' అనే నిర్మాణ సంస్థను స్థాపించిన నేచుర‌ల్ స్టార్ నాని.. నిర్మాత ప్రశాంతి తిపిర్నేని తో కలిసి 'అ!' 'హిట్' వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించారు. వైవిధ్య‌మైన సినిమాలతో న్యూ టాలెంట్ ని ఎంక‌రేజ్ చేస్తూ వస్తున్న నాని.. ప్రస్తుతం అడవి శేష్ హీరోగా 'హిట్' చిత్రానికి సీక్వెల్ గా 'హిట్ 2' సినిమాని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ''మీట్ క్యూట్‌'' అనే మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు.

ప్రశాంత్ వర్మ - శైలేష్ కొలను వంటి టాలెంటెడ్ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వాల్ పోస్టర్ సినిమా.. ఇప్పుడు నాని సోదరి దీప్తి ఘంటా ను డైరెక్టర్‌ గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. "మీట్ క్యూట్" అనేది కంటెంట్ ఆధారిత ఆంథాలజీ అని తెలుస్తోంది. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఆరుగురు మేల్ - ఆరుగురు ఫీమేల్ లీడ్ యాక్టర్స్ నటిస్తున్నారు. వీరితో ఐదు కథలను ఐదు సమావేశాలు ఒక అందమైన సంకలనంగా చెప్పబోతున్నామని మేకర్స్ తెలిపారు.

"మీట్ క్యూట్" చిత్రంలో రోహిణి - అదా శర్మ - వర్ష బొల్లమ్మ - ఆకాంక్ష సింగ్ - రుహాని శర్మ - సునయన - సంచిత పూనచ మహిళా ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. అశ్విన్ కుమార్ - శివ కందుకూరి - దీక్షిత్ శెట్టి - గోవింద్ పద్మసూర్య మరియు రాజా మేల్ లీడ్స్ గా ఎంపిక చేశారు. ఇందులో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జూన్‌ లో ప్రారంభించబడిన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోందని చిత్ర బృందం తెలిపింది.

ఇకపోతే 'మీట్ క్యూట్' చిత్రానికి విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వసంత కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.