Begin typing your search above and press return to search.

నాని జెర్సీ కోసం ఎన్నో పాట్లు

By:  Tupaki Desk   |   29 Jan 2019 11:42 AM GMT
నాని జెర్సీ కోసం ఎన్నో పాట్లు
X
గత ఏడాది అంతగా అచ్చిరాని న్యాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం కొత్త తరహా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. కథల ఎంపికతో పాటు దర్శకుల ఛాయస్ పెట్టుకోవడంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ షూటింగ్ లో ఉన్న నాని షూట్ లో భాగంగా తీస్తున్న క్రికెట్ మ్యాచ్ సందర్భంగా స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. అయితే కొంత రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని మరీ ఎక్కువ ఆందోళన అవసరం లేదని డాక్టర్లు చెప్పడంతో ఎక్కువ గ్యాప్ అవసరం పడేలా కనిపించడం లేదు.

నాని ఆడే టీంతో పాటు ఇందులో అపోజిషన్ కోసం ప్లేయర్లు అవసరం పడటంతో మొత్తం 22 మందిని సెట్ చేసినట్టు తెలిసింది.స్థానికంగా ఉండే ప్లేయర్లను సినిమా కోసం తీసుకోవడంతో మంచి లోకల్ ఫ్లేవర్ తోడయ్యిందట. స్థానిక ఎల్బి స్టేడియంలో డే అండ్ నైట్ షూటింగ్ లో క్రికెట్ మ్యాచ్ ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరొయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ టాలీవుడ్ కు పరిచయమవుతోంది.

యుటర్న్ కన్నడ ఒరిజినల్ వెర్షన్ లో నటించి క్రిటిక్స్ అభినందనలు అందుకున్న శ్రద్ధ తర్వాత మాధవన్ కు జోడిగా విక్రం వేదాలో మెప్పించింది. ఈ రెండూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తెలుగులో అదే రేంజ్ డెబ్యు జెర్సీ అవుతుందన్న నమ్మకంతో ఉంది శ్రద్ధ. ఏప్రిల్ లో విడుదల కానున్న ఈ మూవీ షూటింగ్ ని మర్చి మూడో వారం లోపే పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేయబోతున్నారు. ఇప్పటికే క్రేజీ బిజినెస్ డీల్స్ తో జెర్సీ హాట్ కేక్ గా మారిందని టాక్.