Begin typing your search above and press return to search.

నాని కారుకు యాక్సిడెంట్.. గాయాలు

By:  Tupaki Desk   |   26 Jan 2018 6:14 PM IST
నాని కారుకు యాక్సిడెంట్.. గాయాలు
X
చాలా లేటుగా అందిన వార్త ఏంటంటే.. ఈరోజు ఉదయం షూటింగ్ కు వెళ్తున్న హీరో నాని కారుకు యాక్సిడెంట్ అవ్వడంతో.. సదరు హీరో గాయాలుపాలయ్యాడని తెలుస్తోంది. అసలు ఈ వార్తను పొద్దున్నుంచి ఇప్పటివరకు ఎందుకు దాచి ఉంచారనేది ఎవ్వరికీ అర్ధమవ్వని అంతుపట్టని విషయం. పదండి అసలు ఈ ఘటన వివరాలేంటో చూద్దాం.

రాత్రంతా షూటింగ్ చేసుకుని ఇంటికి వస్తుండగా.. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెం 45లో నాని ప్రయాణిస్తున్న కారు ఒక కరెంట్ పోల్ ను ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జవ్వడంతో పాటు.. నాని కి కూడా గాయాలయ్యాయని తెలుస్తోంది. అయితే కారు డ్రైవర్ శ్రీనివాస్ నిద్రమత్తులో కారును నడపడం వలనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఉదయం ఈ కారును చూసినప్పుడు పోలిసులు వాకబు చేస్తే.. కార్లో ఎవరూ లేరని డ్రైవర్ చెప్పినట్లు తెలుస్తోంది. కాని లేటుగా బయటకు వచ్చిన వార్త ఏంటంటే.. కారులో హీరో నాని మరియు ఇతర స్టాఫ్‌ కూడా ఉన్నారట. పైగా నాని ముఖానికి గాయాలు కావడం వలనే ఇప్పటివరకు వార్తను దాచిపెట్టారని కూడా వార్తలు వస్తున్నాయి.

నిజానికి సదరు కారు నెంబర్ టిఎస్ 07 ఎఫ్‌.సి. 0024 కావడంతో.. వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయగా అది హీరో నాని తండ్రి గంటా రాంబాబు పేరు మీద ఉంది. ఆ నెంబరుతో పోలీసులు ఆరా తీస్తే.. సదరు కార్లో నాని అండ్ స్టాఫ్‌ ఉన్నారని.. నాని కి గాయాలు అయ్యాయని.. కాకపోతే ప్రాథమిక చికిత్స చేయించుకుని నాని ఇంటికి వెళ్ళిపోయాడని అంటున్నట్లు పోలీసులు చెప్పారని.. ఇప్పుడు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో కథనం వచ్చింది.