Begin typing your search above and press return to search.

నాని పారితోషికం పెంచేశాడ‌ట‌గా.. క్రేజ్ అలా ఉంది మ‌రీ..!

By:  Tupaki Desk   |   8 March 2021 7:00 PM IST
నాని పారితోషికం పెంచేశాడ‌ట‌గా.. క్రేజ్ అలా ఉంది మ‌రీ..!
X
తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో హీరో రేంజ్ ను లెక్కించే విష‌యాల్లో ముందు వ‌ర‌స‌లో ఉండేది రెమ్యున‌రేష‌న్‌. ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటే ఆ హీరోకు అంత స్టామినా ఉన్న‌ట్టు లెక్క‌. అభిమానులు కూడా ఇలా ఫిక్స‌యిపోయారు. కాబ‌ట్టి, త‌న స్థాయి నిరూపించేందుకైనా భారీ పారితోషికం తీసుకోవాల్సి ఉంటుంది హీరోలు.

ఇక‌, వ‌ర‌స‌గా హిట్లు ప‌డుతుంటే.. స‌ద‌రు హీరోల పారితోషికం కూడా పెరుగుతూ పోతుంద‌న్న విష‌యం కూడా తెలిసిందే. ఇదే క్ర‌మంలో హీరో నాని త‌న రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేశాడ‌ట‌. అదేంటీ.. ‘వి’ ఫ‌ట్టు క‌దా అంటారేమో.. ఒక్క సినిమా పోయినా.. మ‌నోడి క్రేజ్ మాత్రం అలాగే ఉంది. అందుకే.. రెమ్యున‌రేష‌న్ సెన్సెక్స్ అలా పైకి వెళ్తోంది.

అందుతున్న అప్డేట్ ప్ర‌కారం.. ఒక్క సినిమాకు రూ.14 కోట్లు తీసుకుంటున్నాడ‌ట నాని. ప్ర‌స్తుతం మ‌నోడి కిట్ లో మూడు సినిమాలున్నాయి. శ్యామ్ సింఘ‌రాయ్‌, ట‌క్ జ‌గ‌దీశ్‌, అంటే సుంద‌రానికి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ మూడు సినిమాల‌కు కూడా రూ.14 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాట నాని. దీంతో.. మ‌నోడి క్రేజ్ ను లెక్క‌లోకి తీసుకొని, మార్కెట్ ను ప‌రిశీలించిన మేక‌ర్స్ స‌రేన‌ని చెప్పార‌ట‌.ఇందులో ట‌క్ జగ‌దీశ్ ఏప్రిల్ 23న రిలీజ్ కాబోతోంది. ఈ మూడు చిత్రాల్లో ఏ రెండు హిట్ కొట్టినా.. మ‌ళ్లీ సెన్సెక్స్ పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏం చేస్తారూ.. క్రేజ్ అలా ఉంది మ‌రి!