Begin typing your search above and press return to search.

పిక్ టాక్: బెంగాలీ యువకుడిగా ఇంటెన్స్ లుక్ లో నాని..!

By:  Tupaki Desk   |   30 Oct 2021 11:11 AM GMT
పిక్ టాక్: బెంగాలీ యువకుడిగా ఇంటెన్స్ లుక్ లో నాని..!
X
నేచురల్ స్టార్ నాని హీరోగా ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''శ్యామ్ సింగ రాయ్''. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ వంటి ముగ్గురు ముద్దుగుమ్మలు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2021 డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

గత కొన్ని రోజులుగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ కానుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్ 24వ తేదీన నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ సినిమాను విడుదల చేసే ఆలోచన చేస్తున్నారని.. అందుకే నాని వెనక్కి తగ్గుతున్నాడని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా ఓ సరికొత్త పోస్టర్ మరియు ఫస్ట్ సింగిల్ అప్డేట్ తో మేకర్స్ ఈ రూమర్స్ కు చెక్ పెట్టారు.

లేటెస్టుగా విడుదలైన ‘శ్యామ్ సింగ రాయ్’ పోస్టర్ లో నాని ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. చేతిలో సిగరెట్ పట్టుకొని కుర్చీలో కాలు మీద కాలేసుకుని ఠీవీగా కూర్చొని ఉన్నాడు. బెంగాలీ యువకుడిని గుర్తు చేసేలా ఉన్న మీసకట్టు - హెయిర్ స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్యాగ్రౌండ్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటోని గోడకు తగిలించి ఉండటం గమనించవచ్చు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇందులో నాని ఒక నాయకుడిగా కనిపించనున్నారనే సందేహం కలుగుతుంది. మొత్తం మీద నాని లుక్ డిఫరెంట్ గా ఉంటూ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

'శ్యామ్ సింగ రాయ్' సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - మోషన్ పోస్టర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. నాని ని రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించి ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ''రైజ్ ఆఫ్ శ్యామ్'' అనే పాట లిరికల్ వీడియోని నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మిక్కీ జె మేయర్ ఈ సాంగ్ కు స్వరాలు సమకూర్చారు.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ తో రూపొందుతున్న సినిమా. పాన్ సౌత్ ఇండియా మూవీగా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. సత్యదేవ్‌ జంగా ఈ చిత్రానికి కథ అందించారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న 'శ్యామ్ సింగ రాయ్' సినిమా.. నాని కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.