Begin typing your search above and press return to search.

ఎనిమిది కోట్లు ఇస్తేనే చేస్తాడట

By:  Tupaki Desk   |   13 July 2017 12:30 AM GMT
ఎనిమిది కోట్లు ఇస్తేనే చేస్తాడట
X
హిట్టు రావడం.. హీరో రేటు పెంచడం. ఇదో మంత్రం. దీనిని ఏ మాత్రం సంకోచించకుండా పాటిస్తుంటారు మన హీరోలు. ఒక్క హిట్టొస్తే చాలు.. వెంటనే రేట్లు పెంచేస్తున్నారు కూడా. అలాంటప్పుడు వరుసగా హిట్లు వచ్చిన హీరో ఎంత రేటు పెంచాలి? ఖచ్చితంగా బాగానే డిమాండ్ చేయొచ్చు. పైగా 20 కోట్ల మార్కెట్ జరిగే ఛాన్సున్న హీరో.. కాస్త గట్టిగా అడగటంలో తప్పేలేదు. అలా చూసుకుంటే.. ఇప్పుడు నాని గురించి ఒక మాట వినిపిస్తోంది.

మొన్నటివరకు 5 కోట్లు కోట్ చేశాడట హీరో నాని. మనోడి సినిమాలు చక్కగా 10 కోట్ల బడ్జెట్ లో తీసుకుంటే.. 15 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయి కాబట్టి.. నిర్మాతలకు కూడా 5 కోట్లు ఇవ్వడానికి పెద్దగా ఇబ్బందేం లేదు. ఇక 'నేను లోకల్' సినిమాతో వచ్చిన క్రేజులో ఒక కోటో రెండు కోట్లో పెంచుదాం అని చూస్తున్నవేళ్ళ.. 5 కోట్ల బ్రాకెట్ లోనే మనోడు మరో రెండు మూడు సినిమాలు సైన్ చేసేశాడట. ఇప్పుడిక నిన్ను కోరి సినిమా కూడా హిట్టవుతోంది కాబట్టి.. ఆ సినిమాకు కూడా వసూళ్ళ 20+ కోట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది కాబట్టి.. ఇప్పుడు మనోడు తన తదుపరి సినిమాలకు 8 కోట్లు వసూలు చేయాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది.

వరుసపెట్టి సినిమాలన్నీ ఆడేస్తుండటం.. అసలు ఇటు నిర్మాతలకూ అటు డిస్ర్టిబ్యూటర్లకూ పెద్దగా నష్టాలనేవి రాకపోవడంతో.. నాని ఇప్పుడు ఇలా 8కోట్ల డిమాండ్ ను వాకిట్లో నుంచోబెట్టాడని అంటున్నారు. మరి అంతిస్తేనే సినిమా చేస్తాను అంటే.. ఇవ్వడానికి మేము కూడా రెడీ అంటున్నారట కొందరు నిర్మాతలు. ఆ లెక్కన చూసుకుంటే తన రేంజులోనే ఉన్న ఇతర హీరోలను నాని ఆమడ దూరంలో వదిలేసి.. రవితేజ వంటి హీరోను సైతం బీట్ చేయడానికి రెడీ అయిపోతున్నట్లే.. ఈ రెమ్యూనరేషన్ విషయంలో!!