Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ లో పూర్తి సంతృప్తిగా ఉన్నానంటున్న నాని

By:  Tupaki Desk   |   3 Sep 2020 6:27 PM GMT
టాలీవుడ్‌ లో పూర్తి సంతృప్తిగా ఉన్నానంటున్న నాని
X
ఈమద్య కాలంలో సౌత్‌ హీరోలు ముఖ్యంగా తెలుగు హీరోలు పాన్‌ ఇండియా సినిమాలంటూ పరుగులు తీస్తున్న విషయం తెల్సిందే. స్టార్‌ హీరోల నుండి మీడియం రేంజ్‌ హీరోల వరకు చాలా మంది కూడా పాన్‌ ఇండియా స్క్రిప్ట్‌ ఉంటే చూడు చేద్దాం అంటున్నారని దర్శకులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ సమయంలోనే నాని మాత్రం పాన్‌ ఇండియా సినిమాలపై కాని బాలీవుడ్‌ ఎంట్రీపై ఆసక్తిగా లేడని క్లారిటీ వచ్చింది. మరో రెండు రోజుల్లో ఆయన నటించిన 'వి' సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

'వి' సినిమా నాని కెరీర్‌ లో 25వ సినిమా అనే విషయం తెల్సిందే. నాచురల్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న నాని బాలీవుడ్‌ లో కూడా రానించేంత సత్తా ఉందని అభిమానులు అనుకుంటూ ఉంటారు. కాని ఆ ఆలోచన లేదని వి సినిమా ప్రమోషన్‌ లో సందర్బంగా క్లారిటీ ఇచ్చాడు. నాకు టాలీవుడ్‌ లో పూర్తి సంతృప్తి ఉంది.

నేను వరుసగా టాలీవుడ్‌ లోనే సినిమాలు చేయాలనుకుంటున్నాను. 'వి' విడుదలకు ఉండగానే 'టక్‌ జగదీప్‌' మరియు 'శ్యామ్‌ సింగరాయ' సినిమాను నాని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలు మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలను కూడా ఈ లాక్‌ డౌన్‌ లో కన్ఫర్మ్‌ చేసినట్లుగా పేర్కొన్నాడు. నాని ముందు ముందు కూడా ఇదే మాట మీద ఉంటాడో చూడాలి.