Begin typing your search above and press return to search.

OTT ప్రాప‌కం నానీకి పాఠాలు నేర్పించిందా?

By:  Tupaki Desk   |   17 Sept 2021 11:00 AM IST
OTT ప్రాప‌కం నానీకి పాఠాలు నేర్పించిందా?
X
ఓటీటీలు కొంద‌రికి క‌లిసొస్తున్నాయి. చాలామందికి కలిసి రావ‌డం లేదు. బ‌డ్జెట్ రిక‌వ‌రీ ప‌రంగా సేఫ్ అవుతున్నా హిట్టు అన్న టాక్ రావ‌డం లేదు. అయితే థియేట‌ర్ల‌లో రిలీజై ఫ్లాప‌వ్వాల్సిన‌వి ఓటీటీల వ‌ల్ల సేఫ్ అవుతున్నాయ‌ని కూడా ప్రూవ్ అయ్యింది. ఈ కోణంలో నాని న‌టించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఓటీటీల్లో రిలీజై సేఫ్ అయిన వైనంపై చ‌ర్చ సాగింది. నాని చివరి రెండు సినిమాలు వీ - టక్ జగదీష్ థియేట్రికల్ విడుదలను కాద‌నుకుని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలను డిజిటల్ రంగంలో విడుదల చేయడానికి ఇష్టపడలేదు కానీ నిర్మాతలు ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున అతను ఏమీ చేయలేకపోయాడు. అయితే ఆ రెండు సినిమాల‌పైనా క్రిటిక్స్ పెద‌వి విరిచేశారు. యావ‌రేజ్ కంటెంట్ అంటూ రివ్యూలొచ్చాయి. కార‌ణం ఏదైనా ఓటీటీల్లో విడుద‌ల చేసి నిర్మాత‌లు తెలివిగా సేఫ్ అయ్యార‌న్న టాక్ వినిపించింది. ట‌క్ జ‌గ‌దీష్ భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై పెద‌వి విరుపుల‌కు కార‌ణ‌మైన సంగ‌తి తెలిసిన‌దే.

కార‌ణం ఏదైనా కానీ ఇక‌పై నాని తాను న‌టించే సినిమాల‌ను ఓటీటీల్లో నేరుగా విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింఘ‌రాయ్ ని మాత్రం నేరుగా థియేట‌ర్ల‌లో మాత్ర‌మే విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నాడు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న శ్యామ్ సింఘ రాయ్ పీరియడ్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

రెండు ఫ్లాపుల అనంత‌రం నాని త‌దుప‌రి హిట్టు కొట్టాల‌ని పంతంతో ఉన్నార‌ట‌. పెద్ద తెరపై విడుదలతో ఘ‌న‌ విజయం సాధించాలని నాని కోరుకుంటున్నాడు. స్పష్టంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకి ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. ఈ ఎపిసోడ్ లో సాయి పల్లవి నాని భార్య పాత్రలో నటించడం పెద్ద ప్ల‌స్ కానుంది. ఈ సినిమాలో కృతి శెట్టి మరో క‌థానాయిక‌. ఈ ఏడాది డిసెంబర్ లో శ్యామ్ సింఘ రాయ్ ని విడుదల చేయాల‌న్న‌ది ప్లాన్.

నాని తెలివిగా సంక్రాంతికి ముందే విడుద‌ల‌కు రావాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. ఇక సంక్రాంతి బ‌రిలో భారీ పోటీ నెల‌కొంది. `స‌ర్కారు వారి పాట‌`..`ఆచార్య‌`..`ఎఫ్ -3` స‌హా కొంత మంది స్టార్ హీరోల చిత్రాల‌తో పాటు.. మీడియం హీరోల సినిమాలు సంక్రాంతికి విడుద‌ల‌కానున్నాయి. కానీ సంక్రాంతి బ‌రిలో `ఆర్.ఆర్.ఆర్` విడుద‌లైతే ఏం జ‌ర‌గ‌నుందో తేలాల్సి ఉంది.

శ్యామ్ సింఘ‌రాయ్ క్రేజ్ అంతా ఇంతా కాదు!

నేచురల్ స్టార్ నానీకి శ్యామ్ సింఘ‌రాయ్ ఆన్ లొకేష‌న్ ఎదురైన అనుభ‌వం షాకిచ్చేదే. తన డైహార్డ్ అభిమానులలో ఒకరు `శ్యామ్ సింఘరాయ్` సెట్స్ కి వ‌చ్చి త‌న‌తో సెల్ఫీ దిగాల్సిందేనంటూ ప‌ట్టుబ‌ట్టాడ‌ట‌. రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నప్పుడు నానితో సెల్ఫీ దిగిన సంగ‌తి తెలిసిందే. ఆ అభిమాని ఉత్సాహాన్ని నాని ఆప‌లేక‌పోయారు.

``మీరు నాతో సెల్ఫీ దిగ‌క‌తే.. నేను ఇక్కడ షూటింగ్ జరగనివ్వను`` అని డైహార్డ్ ఫ్యాన్ ఫ‌న్నీగానే హెచ్చ‌రించినంత ప‌ని చేయ‌డం అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. నాని ఆ క్ష‌ణం ఎంతో ఆశ్చ‌ర్య‌పోయాడ‌ట‌. హెచ్చరికతో ఆకట్టుకున్న తన అభిమానితో సెల్ఫీ తీసుకున్నాడు. ఇటీవ‌ల నాని కొంద‌రు అభిమానుల‌ను క‌లుసుకుని సెల్ఫీలు దిగార‌ట‌. షూటింగ్ విరామ సమయంలో తన అభిమానులతో గడిపార‌ని తెలిసింది.

సెకండ్ వేవ్ ప్ర‌భావంతో శ్యామ్ సింఘరాయ్ షూటింగ్ కి బ్రేకులు ప‌డినా ఆ త‌ర్వాత చిత్రీక‌ర‌ణ‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసి సైమ‌ల్టేనియ‌స్ గా నిర్మాణానంత‌ర ప‌నులు సాగిస్తున్నార‌ని తెలిసింది. ఈ మూవీ కోసం
భారీ ఎత్తున నిర్మించిన కోల్ క‌త సెట్స్ లో ఈ షూటింగ్ చేసిన సంగ‌తి విధిత‌మే. సింఘ‌రాయ్ కి ఫిల్మీ వ‌ర్గాల్లో చ‌క్క‌ని క్రేజు నెల‌కొంది. ఈ చిత్రానికి టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృతన్ దర్శకుడు‍. సాయి పల్లవి‍‍‍- కృతి శెట్టి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. నిహారికా ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది.