Begin typing your search above and press return to search.

నేచురల్ స్టార్ కి జెంటిల్మన్ ధైర్యం

By:  Tupaki Desk   |   24 Jun 2016 4:31 AM GMT
నేచురల్ స్టార్ కి జెంటిల్మన్  ధైర్యం
X
నేచురల్ స్టార్ నాని చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు. ఓ సినిమా హిట్ అయితే హీరో హ్యాపీగా ఉండడం పెద్ద విశేషం కాదు. అలాగే నానికి సక్సెలు కూడా కూడా కొత్త కాదు. ఎవడే సుబ్రమణ్యం - భలేభలే మగాడివోయ్ - కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రాలతో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టేసి.. ఇప్పుడు మరో హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాడు.

అయితే ఇప్పుడు నానికి సంతోషాన్నిచ్చిన అంశం.. జెంటిల్మన్ లో చేసిన కేరక్టర్. 'ఇప్పటివరకూ నేను పక్కింటి అబ్బాయ్ రోల్ నో.. లవర్ బోయ్ కేరక్టర్లను మాత్రమే చేశాను. కానీ తొలిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయడం.. దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం చూస్తుంటే.. చాలా ఆనందంగా ఉంది' అను చెబుతున్నాడు నాని. 'రీసెంట్ గా ఫిలింఫేర్ అందుకున్నపుడు దక్కిన ఆనందం కంటే.. జెంటిల్మన్ పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే కడుపు నిండిపోయింద'న్నది ఈ హీరో ఫీలింగ్.

ఇప్పటివరకూ నాని ఇలాంటి పాత్రలే చేస్తాడని.. ఇండస్ట్రీలో ఉన్న పరిమితులను బ్రేక్ చేయగలిగానని అంటున్నాడు నాని. జెంటిల్మన్ లాంటి విభిన్న చిత్రం సక్సెస్ ద్వారా.. తాను మరిన్ని ప్రయోగాలు చేసేందుకు అవకాశం వచ్చిందని చెప్పిన నాని.. కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఈ విజయం తనకు ధైర్యం ఇచ్చిందని అన్నాడు.