Begin typing your search above and press return to search.

సినీ వర్కర్ల కోసం నేచురల్ స్టార్ భారీ విరాళం..

By:  Tupaki Desk   |   30 March 2020 4:00 PM GMT
సినీ వర్కర్ల కోసం నేచురల్ స్టార్ భారీ విరాళం..
X
నేచురల్ స్టార్ నాని. తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. సహజంగా నటించడమే కాకుండా సహజమైన జీవన విధానాన్ని కూడా పాటిస్తుంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి స్టార్ హీరోగా ఎదిగిన నానికి సినిమా ఇండస్ట్రీలో సినిమాల కోసం పనిచేసే దినసరి కూలీల కష్టం గురించి బాగా తెలుసు. ఈ మధ్య కరోనా వైరస్ మూలంగా ప్రపంచం మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో సినీ వర్కర్స్ కి పని లేకుండా పోయింది. ఈ దెబ్బతో సినిమా బాధితులంతా రోడ్డున పడ్డట్లయింది.

ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందించి భారీ విరాళాలు అందించడానికి కదిలి వస్తున్నారు. ఈ విరాళాల ద్వారా అయినా సినీ వర్కర్లకు కనీస సదుపాయాలు సమకూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని కూడా సినీ వర్కర్ల కోసం 30లక్షల రూపాయలు విరాళం అందించి ఆపద్భాందవుల జాబితాలో ఒకడిగా నిలిచాడు. ఇక నానితో మొదలైన ఈ కుర్ర హీరోల ఫండ్స్ హవా అందరు హీరోలు కదిలి వచ్చేలా చేయాలనీ ఆశిస్తున్నారు. నానితో పాటు యంగ్ హీరో నారా రోహిత్ 30లక్షలు - సుశాంత్ 2లక్షలు - వెన్నెల కిషోర్ 2లక్షలు - బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 1లక్ష రూపాయలతో సినీ వర్కర్లను ఆదుకోవడానికి ముందడుగు వేశారు. అయితే నేచురల్ స్టార్ నాని స్పందించి విరాళం అందించడంతో సినీ అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.