Begin typing your search above and press return to search.

'గ్యాంగ్ లీడ‌ర్' టైటిల్ నాని కాజేశాడా?

By:  Tupaki Desk   |   9 March 2019 4:17 AM GMT
గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ నాని కాజేశాడా?
X
రెండు కంపెనీలు ఒకే టైటిల్ కోసం కొట్టుకుంటే ఆ స‌న్నివేశం ఎలా ఉంటుందో తెలిసిందే. ఇటీవ‌లే `ముద్ర‌` టైటిల్ కోసం న‌ట్టి కుమార్ బ్యాచ్ .. నిఖిల్ గ్యాంగ్ తో ఫైట్ చేసింది. చివ‌రికి నిఖిల్ ఆ టైటిల్ వ‌దులుకుని `అర్జున్ సుర‌వ‌రం` అంటూ కొత్త టైటిల్ ప్ర‌క‌టించారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సిగ‌ప‌ట్లు అక్క‌డితో ముగిశాయి. ఇప్పుడు మ‌రోసారి అలాంటి ఫైటింగే టాలీవుడ్ ని వేడెక్కిస్తోంది.

నాని హీరోగా విక్ర‌మ్.కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రానికి గ్యాంగ్ లీడ‌ర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశామ‌ని ఆ చిత్ర బృందం ప్ర‌క‌టించింది. దాంతో ఉన్న‌ట్టుండి టైటిల్ వార్ లోకి వ‌చ్చింది వేరొక బ్యాన‌ర్. చిరంజీవి వీరాభిమానిగా ఆ టైటిల్ తో సినిమా తీస్తున్నాం. ఆరు నెల‌ల క్రితం రిజిస్ట‌ర్ చేయించాం...చ‌ట్ట విరుద్ధంగా లాక్కోవాల‌ని చూశారు.. ఇస్తే మెగా ఫ్యామిలీకి ఇస్తాం కానీ ఎవ‌రికీ ఇవ్వం!! స‌సేమిరా అంటున్న మాణిక్యం మూవీస్ నిర్మాత యుద్ధానికి దిగ‌డంతో సీన్ వేడెక్కిపోయింది. నానీకి బిగ్ కౌంట‌ర్ ఇవ్వ‌డంతో ప్ర‌స్తుతం టైటిల్ విష‌య‌మై డైలెమా కొన‌సాగుతోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ `గ్యాంగ్ లీడ‌ర్` టైటిల్ ని నాని కాజేశాడు అంటూ ప‌రోక్షంగా స‌ద‌రు నిర్మాత‌లు ఆరోపించారు.

ప్ర‌స్తుతం ఫిలింఛాంబ‌ర్ స‌మ‌క్షంలో ఈ గొడ‌వ‌కు ప‌రిష్కారం వెతుకుతున్నారు. ఆరు నురయినా గ్యాంగ్ లీడర్ టైటిల్ తో సినిమా నిర్మిస్తామని మాణిక్యం మూవీస్ నిర్మాత కం హీరో మోహన్ కృష్ణ ఫిల్మ్ చాంబర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. మాణిక్యం మూవీస్ `గ్యాంగ్ లీడ‌ర్` ఉగాది నుండి గోదావరి జిల్లాల లో 40 రోజుల పాటు షూటింగు ప్లాన్ చేసాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిరంజీవి పుట్టిన రోజు కానుక గా ఆగస్ట్ 22న‌ ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. చిరంజీవి గారి టైటిల్ ప్రకటించగానే మంచి స్పంద‌న‌ వచింది. టైటిల్ హుందా తనానికి ఎక్కడా భంగం కల‌గ‌కుండా చిత్రం నిర్మిస్తాం. దేశానికి వెన్నుముక అయిన రైతు ఎదుర్కొంటున్న సమస్యల‌పై సినిమా తీస్తున్నాం`` అన్నారు. మొత్తానికి ఈ టైటిల్ నానీకి ద‌క్కుతుందా లేదా? ఏదైనా రాజీ బేరం కుదుర్చుకుంటారా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.