Begin typing your search above and press return to search.

గ్యాంగ్ లీడ‌ర్ రిలీజ్ తేదీ?

By:  Tupaki Desk   |   17 May 2019 9:55 AM GMT
గ్యాంగ్ లీడ‌ర్ రిలీజ్ తేదీ?
X
జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా నేచుర‌ల్ స్టార్ నాని దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. దేవ‌దాస్.. జెర్సీ చిత్రాల‌తో క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకున్న నాని బాక్సాఫీస్ హిట్ల‌తో సంబంధం లేకుండానే వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిట‌వ్వ‌డం ఆస‌క్తి రేకెత్తించేదే. ఒక‌దాని వెంట ఒక‌టిగా నానీ న‌టించిన‌ సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికిప్పుడు వ‌రుస‌గా రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటిలో విక్ర‌మ్.కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం స‌గం (50శాతం) షూటింగ్ పూర్త‌యింది. ఈ సినిమాతో పాటు ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాత‌గా `వీ` అనే సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు మ‌రో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

ఈ రెండూ సెట్స్ లో ఉండ‌గానే నానీ త‌దుప‌రి సినిమాకి క‌థ‌లు వినేందుకు ప్రిపేర‌వుతున్నాడ‌ని తెలుస్తోంది. తాజాగా గ్యాంగ్ లీడ‌ర్ రిలీజ్ తేదీపై క్లారిటీ వ‌చ్చేసింది. ఈ సినిమాని ఆగ‌స్టు 30న రిలీజ్ చేస్తున్నామ‌ని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ‌ ప్ర‌క‌టించింది. నిజానికి దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ రిలీజ్ తేదీ విష‌య‌మై మైత్రి సంస్థ చాలా క‌న్ఫ్యూజ‌న్ లో ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా రిలీజ్ తేదీ ప‌లుమార్లు వాయిదా ప‌డింది. దీంతో గ్యాంగ్ లీడ‌ర్ విష‌యంలో స‌ద‌రు సంస్థ చాలా క్లారిటీగా మూవ్ అవుతోందిట‌. డియ‌ర్ కామ్రేడ్ రిలీజ్ తో ఏ సంబంధం లేకుండా నానీ సినిమాకి లైన్ క్లియ‌ర్ కావ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

గ్యాంగ్ లీడ‌ర్ సినిమా విష‌యంలో ఆరంభ‌మే ఓ చిక్కు వ‌చ్చి ప‌డింది. అగ్ర‌నిర్మాత సి.అశ్వ‌నిద‌త్ కి ఓ సినిమా విష‌య‌మై ప్రామిస్ చేసిన విక్ర‌మ్.కె.కుమార్ అటుపై ఆ ఒప్పందం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు చాలానే శ్ర‌మించాల్సొచ్చింది. దీంతో మైత్రి సంస్థ ఇన్వాల్వ్ అయ్యి ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించింది. గ్యాంగ్ లీడ‌ర్ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహ‌న్ నాయిక‌. ఒక గాళ్స్ గ్యాంగ్ టీమ్ ని లీడ్ చేసే గ్యాంగ్ లీడ‌ర్ గా నాని ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుండ‌డం ఆసక్తి రేకెత్తించే ఎలిమెంట్ అనడంలో సందేహ‌మేం లేదు.