Begin typing your search above and press return to search.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. నాని నుంచి సౌండ్ లేదు?

By:  Tupaki Desk   |   22 Jan 2023 3:37 PM GMT
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. నాని నుంచి సౌండ్ లేదు?
X
శ్యాం సింగరాయ లాంటి బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న నాని... ఆ తర్వాతి చేస్తున్న ప్రాజెక్టు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దసరా పేరుతో జరిగే తెరకెక్కుతున్న తాజా ప్రాజెక్టులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడమే కాదు... నాని పూర్తిస్థాయి రఫ్ రగ్గడ్ లుక్ లో నటిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న.. ఈ సినిమాకి సత్యం సూర్య సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా మార్చి 30వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాని గోదావరిఖని నేపథ్యంలో సింగరేణి గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే వారు ప్రకటించిన తేదీ ప్రకారం దాదాపు ఇంకా నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది కానీ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నామని పాన్ ఇండియా లెవెల్లో సినిమా వస్తోందని చెబుతున్నారు. అయితే సరిగ్గా నెలరోజులు కూడా లేకుండా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ఎలా రిలీజ్ చేయబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

పాన్ ఇండియా సినిమా రిలీజ్ అంటే ఆయా భాషలలో ఇప్పటికే స్టార్లుగా ఉన్న వారి చేత ట్రైలర్లు, టీజర్లు లాంచ్ చేయించి కుదిరితే సుడిగాలి పర్యటనలు కూడా అక్కడ చేసి రావాల్సి ఉంటుంది. కానీ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న ఇంకా ఏమాత్రం సినిమా యూనిట్ ఆసక్తి చూపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు నిజంగానే సినిమాని మార్చిలో విడుదల చేస్తున్నారా లేక సినిమా వాయిదా వేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో సముద్ర ఖని మీరాజాస్మిన్ ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ వంటి భారీ స్టార్ కాస్టింగ్ కూడా ఉంది. ఇంతమందిని పెట్టుకుని సినిమాని ప్రమోట్ చేయకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.