Begin typing your search above and press return to search.

'వి': రక్షకుడిని డామినేట్‌ చేస్తున్న రాక్షసుడు

By:  Tupaki Desk   |   11 Feb 2020 6:00 AM GMT
వి: రక్షకుడిని డామినేట్‌ చేస్తున్న రాక్షసుడు
X
నాచురల్‌ స్టార్‌ నాని ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్‌ పాత్రలను ఎంపిక చేసుకుని మరీ నటిస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు నాని చేసిన 24 చిత్రాలు కూడా చాలా విభిన్నమైన పాత్రలే అని చెప్పుకోవచ్చు. ప్రతి పాత్రలో కూడా నటనకు ఆస్కారం ఉంటుంది. ఇన్నాళ్లు చేసినవాటికి పూర్తి విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తన 25వ చిత్రంలో నాని విలన్‌ పాత్రను పోషించేందుకు సిద్దం అయ్యాడు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న ‘వి’ సినిమాలో నాని విలన్‌ గా నటిస్తున్నాడు. ఇప్పటికే రాక్షసుడి గా నాని లుక్‌ బయటకు వచ్చింది.

సుధీర్‌ బాబు రక్షకుడు అయితే నాని రాక్షసుడు అంటూ యూనిట్‌ సభ్యులు విభిన్నంగా పబ్లిసిటీ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి మరో పోస్టర్‌ ను విడుదల చేశారు. ఈనెల 17న టీజర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించి ఈ పోస్టర్‌ ను తీసుకు వచ్చారు. ఈ పోస్టర్‌ లో రాక్షసుడు మరియు రక్షకుడు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇంతకు ముందు విడుదల చేసిన పోస్టర్స్‌ లో ఇద్దరు వేరు వేరు పోస్టర్స్‌ లో ఉండటం వల్ల కంపేరిజన్‌ చేయలేదు. కాని ఇద్దరు ఒకే పోస్టర్‌ లో ఉండటం తో పోలిక తప్పడం లేదు.

సోషల్‌ మీడియాలో ఈ పోస్టర్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. ఈ పోస్టర్‌ లో రాక్షసుడి గా నాని లుక్‌ మరింత ఆకట్టుకునే విధంగా ఉందని.. ముందు ఉన్న రక్షకుడు సుధీర్‌ బాబును డామినేట్‌ చేసే విధంగా రాక్షసుడి లుక్‌ ఉంది అని.. నాని ముందు సుధీర్‌ బాబు నిలబడగలడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఈ కొత్త ‘వి’ పోస్టర్‌ ఉంది. సినిమాను మార్చ్‌ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సమ్మర్‌ హాలీడేస్‌ ను ‘వి’ మొదలు పెట్టబోతుంది.