Begin typing your search above and press return to search.

బాహుబలికి నాని కట్ చెప్పాడు..

By:  Tupaki Desk   |   23 Jun 2016 9:41 AM IST
బాహుబలికి నాని కట్ చెప్పాడు..
X
బాహుబలి షూటింగ్ నిర్విరామంగా రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న విషయం తెలిసినదే. ఏరోజుకారోజు తమ షూటింగ్ లో జరుగుతున్న ఆసక్తికరమైన అంశాలను ఆ రోజు చివర స్నాప్ చాట్ సహాయంతో పొందుపరుస్తూ ప్రేక్షకులకు అందిస్తున్నారు.

అయితే నిన్న బాహుబలి షూటింగ్ ని కాసేపు యువహీరో నాని డైరెక్ట్ చెయ్యడం విశేషం. తన లేటెస్ట్ మూవీ జెంటిల్ మన్ సినిమా క్యాప్షన్ హీరో? విలన్? అన్నదానికి ప్రత్యుమ్న్యాయంగా హీరో? డైరెక్టర్? అంటూ పోస్ట్ చెయ్యడం విశేషం.

నిజానికి నాని హీరోగా నటించకముందు బాపు వంటి దిగ్గజ దర్శకులదగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసినదే. విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన తదుపరి సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిలింసిటీలో జరుగుతుండడంతో ఈ సంఘటన ఏర్పడినట్టు సమాచారం. మరి ఆ మెళుకువలు ఏమన్నా బాహుబలి సెట్ లో ప్రయోగించాడా?