Begin typing your search above and press return to search.

స్టార్ హీరోతో నాని మల్టీస్టారర్.. అందుకే కాన్సల్ అయిందా..?

By:  Tupaki Desk   |   17 April 2020 12:30 AM GMT
స్టార్ హీరోతో నాని మల్టీస్టారర్.. అందుకే కాన్సల్ అయిందా..?
X
టాలీవుడ్ స్టార్ హీరో నాని-హీరో విశాల్ ఒకే స్క్రీన్ పై కనిపించేందుకు సిద్ధమవుతున్నారట. యాత్ర సినిమా దర్శకుడు మహి వి రాఘవ తెలుగు తమిళ హీరోలతో కలిసి భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేస్తున్నట్లు గతంలోనే ఒక టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు దాదాపు కథానాయకులు ఇద్దరూ సెట్ అయినట్లు సమాచారం. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని స్టార్ హీరో నాగార్జునతో కలిసి చేసిన దేవదాస్ పరవాలేధనిపించింది. ఇక మరో మల్టీస్టారర్ లో కూడా నటించే అవకాశం ఉన్నట్లు మొన్నటివరకు వార్తలు వచ్చాయి. ఇక ఫైనల్ గా విశాల్ తో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుసింది. పైగా తమిళంలో కూడా నాని స్టార్ డమ్ కి తప్పకుండా ఈ మల్టీస్టారర్ ఉపయోగపడనుంది అనుకున్నారు.

ఇక హీరో విశాల్ కి ఇప్పటికే టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు నానితో కలిసి నటిస్తే తెలుగులో మరింతగా క్రేజ్ పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు మహి వి రాఘవ త్వరలోనే ఈ మల్టీస్టారర్ పై అధికారికంగా స్పందించే అవకాశం ఉండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి ఈ మల్టీస్టారర్ ను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ సిద్దమైందట. అయితే మళ్ళీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ బయటకు రాకపోవడంతో క్యాన్సిల్ అయ్యిందని టాక్ వస్తోంది. కొన్ని కథనాల ప్రకారం.. కథ నచ్చకపోవడంతో నాని నో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ మల్టీస్టారర్ కథలు తన దగ్గరకు వస్తే మాత్రం నాని చేయాలనే ఆసక్తితో ఉన్నాడట.