Begin typing your search above and press return to search.

నానికి కొత్త ఊపొచ్చింది

By:  Tupaki Desk   |   29 April 2023 10:01 AM GMT
నానికి కొత్త ఊపొచ్చింది
X
నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా దసరా. నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా ఈ మూవీ నిలిచింది. కీర్తి సురేష్ కి కూడా మహానటి తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ ని, కీర్తిని దసరా సినిమా అందించింది. ఇక నాచురల్ స్టార్ నాని కూడా కెరియర్ లో కూడా దసరా మూవీతో అరుదైన రికార్డులను తన సొంతం చేసుకున్నారు.

టైర్ 2 హీరోల జాబితాలో ఉన్న నాని దసరా మూవీతో తన మార్కెట్ రేంజ్ ని మరింతగా పెంచుకున్నారని చెప్పాలి. ఈ సినిమా థియేటర్స్ లో 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఈ చిత్రం గుర్తింపు తెచ్చింది. అలాగే మొదటి రోజు హైయెస్ట్ షేర్ రాబట్టిన మూవీగా కూడా దసరా నిలిచింది.

ఓవర్సీస్ మార్కెట్లో 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో నాని ఈ మూవీతో చేరిపోయారు. ఇక నిర్మాతకు కూడా వరుస ఆరు డిజాస్టర్ చిత్రాల తర్వాత దసరా సినిమా సూపర్ సక్సెస్ అందించింది. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాకి మొదటి చిత్రమే స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ దర్శకుడుతో నిర్మాతలు సినిమాలు చేయడానికి అడ్వాన్స్ లు ఇచ్చి మరి ఒప్పందం చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ధియేటర్స్ లో దసరా సినిమాని చూడలేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా దసరా సినిమాని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ హీరోలలో ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ నానికి ఉందని చెప్పాలి.

డీసెంట్ కంటెంట్ లతో నాని ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. శ్రీకాంత్, జగపతిబాబు, వెంకటేష్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉన్న హీరోగా నాని నిలబడ్డారు. ఇప్పుడు దసరా సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన కూడా కంటెంట్ లో ఎక్కడ అశ్లీలత లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓటీటీలో ఆస్వాదిస్తూ ఉండడం విశేషం. మరి డిజిటల్ ఆడియన్స్ కు ఈ సినిమా ఏ స్థాయిలో రీచ్ అయ్యింది అనేది త్వరలో తెలిసిపోతుంది.