Begin typing your search above and press return to search.

నాని సినిమాకు అదే ప్లస్‌.. అదే మైనస్‌!

By:  Tupaki Desk   |   3 Feb 2023 11:00 AM GMT
నాని సినిమాకు అదే ప్లస్‌.. అదే మైనస్‌!
X
నాచురల్ స్టార్‌ నాని 'దసరా' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. బొగ్గు గనుల మధ్య ఉండే ఒక చిన్న పల్లెకు సంబంధించిన కథ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు తాజాగా విడుదల అయిన టీజర్ తో క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాలో నాని లుక్ పై మరింత స్పష్టత వచ్చింది.

దసరా సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలోనే నాని లుక్ ను రివీల్‌ చేయడం జరిగింది. నానిని బొగ్గు గనిలో కార్మికుడిగా చూడబోతున్నామని అప్పటి నుంచి ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యి ఉన్నారు. నాని డీ గ్లామర్ గా.. కాస్త విభిన్నంగా మాస్ లుక్ లో కనిపిస్తాడని ఫ్యాన్స్ ముందుగానే ఒక ఊహతో ఉన్నారు. కానీ తాజాగా ఫ్యాన్స్ కూడా టీజర్ చూసి షాక్ అయ్యారు.

నాని మాస్ లుక్ తో పాటు.. పాత్ర ప్రవర్తన తీరు కూడా మరీ షాకింగ్ గా ఉంది. సినిమాకు నాని లుక్‌ ప్లస్ అవుతుందని అంటూ యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు. సినిమాలోని నాని లుక్‌ తో మంచి పబ్లిసిటీ అయితే దక్కింది.. అదే సమయంలో కొందరు నానిని ఇలా చూడగలమా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో రంగస్థలం సినిమా లో రామ్‌ చరణ్ లుక్ చూసిన సమయంలో కూడా కొందరు నెగటివ్‌ గా కామెంట్స్ చేశారు. అలాగే పుష్ప లో బన్నీ లుక్ కు కూడా బ్యాడ్‌ కామెంట్స్ వచ్చాయి. కానీ ఆ రెండు సినిమాల ఫలితాలు ఏంటో మనం చూశాం.. ఆ సినిమాల స్థాయిలోనే దసరా సినిమా కూడా ఉంటుందేమో అంటూ కొందరు నాని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

మొత్తానికి దసరా సినిమా ఈ ఏడాది మొత్తం మాట్లాడుకునే సినిమాగా నిలుస్తుందని.. అలాగే భవిష్యత్తులో ఎప్పుడు 2023 లో టాలీవుడ్‌ లో వచ్చిన సినిమాల ప్రస్తావన వచ్చినా కూడా దసరా పేరు మొదట వినిపించే అవకాశాలు ఉన్నాయంటూ యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు.

టీజర్ విడుదలకు ముందు నాని ట్విట్టర్‌ లో శ్రీకాంత్‌ ఓదెల... ఈ పేరును గుర్తు పెట్టుకోండి అంటూ ట్వీట్‌ చేశాడు. అన్నట్లుగానే టీజర్ విడుదల అయినప్పటి నుంచి శ్రీకాంత్ ఓదెల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఆమె కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.