Begin typing your search above and press return to search.
నాని నిర్మాతలు అందుకే మారారా?
By: Tupaki Desk | 21 Oct 2020 1:20 PM ISTనేచులర్ స్టార్ నాని లైన్లో పెట్టిన సినిమాల్లో ''శ్యామ్ సింగ రాయ్'' అనే మూవీ ఉన్న సంగతి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను ముందుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నట్లు ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం 'టక్ జగదీష్' సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్న నాని.. ఈ సినిమా పూర్తైన వెంటనే 'శ్యామ్ సింగ రాయ్' ని స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రొడక్షన్ నుంచి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు వెంకట్ బోయనపల్లి అనే నిర్మాత తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అయితే 'శ్యామ్ సింగ రాయ్' చిత్రానికి ప్రొడ్యూసర్స్ మారడానికి బడ్జెట్ ఇష్యూనే కారణమని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. నాని ఈ చిత్రాన్ని గుడ్ బడ్జెట్ తో తీయాలని నిర్మాతలకి సూచించారట. అయితే కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో అంత బడ్జెట్ తో సినిమా అంటే కష్టమని సదరు నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. నాని మాత్రం ఈ సబ్జెక్టు మీద నమ్మకంతో ఇది కచ్చితంగా లాభాలు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని.. బడ్జెట్ విషయంలో రాజీ పడకూడదు అనుకున్నారట. ఈ కారణాల వల్లనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ చేతులు మారిందని అనుకుంటున్నారు. కాగా, 'శ్యామ్ సింగ రాయ్' అనే వైవిధ్యమైన టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి మరియు అదితిరావు హైదరీ హీరోయిన్లుగా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.