Begin typing your search above and press return to search.
స్పెషల్ రోల్ లో నాని?
By: Tupaki Desk | 3 Sept 2016 2:33 PM ISTయువ కథానాయకుడు నాని జ్యో అచ్యుతానందలో స్పెషల్ రోల్ చేశాడా? సినిమాలో రెజీనాని పెళ్లి చేసుకొనే కుర్రాడిగా నానినే కనిపించబోతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `జ్యో అచ్యుతానంద`. నారా రోహిత్ - నాగశౌర్య కథానాయకులుగా నటించారు. రెజీనా కథానాయిక. అన్నదమ్ములిద్దరూ ఒకే అమ్మాయిని చూసి మనసు పారేసుకొనే ఓ కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అన్నదమ్ములిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడమనే అంశం కొత్తగా అనిపిస్తోంది. క్లైమాక్స్ లోనైనా అమ్మాయి ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకోవల్సిందే కదా! మరి ఇద్దరూ ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి ఎవరి సొంతమవుతుందన్న విషయమే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. శ్రీనివాస్ అవసరాల అక్కడ కథని ఎలా డీల్ చేశాడో చూడాలి మరి! అ
యితే తాజాగా ప్రచారంలో ఉన్న విషయమేంటంటే సినిమాలో నాని ఓ స్పెషల్ రోల్ చేశాడని. కథానాయకులైన ఇద్దరన్నదమ్ముల్నీ కాదని రెజీనా నానినే పెళ్లి చేసుకొంటుందని, ఆ పాత్రలోనే నాని నటించాడని చెప్పుకొంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నానితో వారాహి సంస్థకీ - శ్రీనివాస్ అవసరాలకీ మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఒకవేళ స్పెషల్ రోల్ కోసం సంప్రదించారంటే వాళ్ల మధ్యనున్న అనుబంధం దృష్ట్యా నాని తప్పకుండా నటించుంటాడు. క్లారిటీ మాత్రం సినిమా విడుదలైతే కానీ వచ్చే అవకాశం లేదు.