Begin typing your search above and press return to search.

బిగ్ బాస్2 కోసం అ!లాంటి ప్రోమో!!

By:  Tupaki Desk   |   2 Jun 2018 11:11 AM GMT
బిగ్ బాస్2 కోసం అ!లాంటి ప్రోమో!!
X
బిగ్ బాస్2 అంటూ నాని వచ్చేస్తున్నాడు. ఆన్ స్క్రీన్ పై న్యాచురల్ స్టార్ గా ఎదిగిన నాని.. దాదాపు మూడేళ్లుగా పరాజయం అన్నది చూడకుండా దూసుకుపోతున్నా.. చివరగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం మాత్రం నాని స్పీడుకు బ్రేకులేసింది. ఆ విషయాన్ని ఓపెన్ గా ఒప్పుకుని ఆకట్టుకున్న నాని.. ఇప్పుడు బుల్లితెరపై బిగ్ బాస్ హోస్ట్ గా అలరించబోతున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 2 కు నాని హోస్ట్ కాగా.. ఈ నెల 10 నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. పార్టిసిపెంట్స్ ఎవరనే విషయంపై తప్ప మిగిలిన డీటైల్స్ ప్రకటించారు. ఈ నెల 10 నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్2 కోసం.. ఇప్పుడు కొత్త టీజర్ ను కూడా విడుదల చేశారు. నాని రీసెంట్ గా నిర్మించి.. చేపకు డబ్బింగ్ చేసిన అ! మాదిరిగా ఈ ప్రోమో ఉండడం విశేషం. మనుషుల్లో అనేక రకాలు ఉంటారంటూ.. ఆయా వ్యక్తుల తీరును చూపేందుకు.. రకరకాల చేపలను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అక్వేరియంలో ఉన్న చేపలకు ఫుడ్ వేస్తూ.. నాని వాయిస్ చెబుతున్న విషయాన్ని చివరలో రివీల్ చేశారు.

అప్పటి వరకు అ! మూవీ టైపులో చేపకు డబ్బింగ్ చెబుతున్నట్లుగానే ఉంది. తన సినిమా థీమ్ తోనే బుల్లితెర రియాల్టీ షోకు ప్రోమో ఇచ్చిన కాన్సెప్టు బాగుందనే చెప్పాలి. మరి ఎన్టీఆర్ ను మరిపించే రేంజ్ లో నాని మెప్పిస్తాడో లేదో చూడాలి.