Begin typing your search above and press return to search.

'K.P.V.S.S.P.R సుందర ప్రసాద్' గా నాని..!

By:  Tupaki Desk   |   30 Dec 2021 12:30 PM GMT
K.P.V.S.S.P.R సుందర ప్రసాద్ గా నాని..!
X
'శ్యామ్ సింగరాయ్' తో మంచి సక్సెస్ అందుకున్న నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 28వ సినిమా ''అంటే.. సుందరానికీ!''. టైటిల్ అనౌన్సమెంట్ పోస్టర్ తోనే మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఈ క్రమంలో తాజాగా ఇందులో నాని పాత్ర పేరుని పరిచయం చేసారు. నాని ఈ సినిమాలో 'K.P.V.S.S.P.R సుందర ప్రసాద్' అనే పాత్రలో కనిపిస్తారని తెలిపారు. గత రెండు చిత్రాల్లో టక్ జగదీష్ - శ్యామ్ సింగరాయ్ వంటి విభిన్నమైన పేర్లు పెట్టుకున్న నాని.. ఈ సినిమాలో ఎవరూ పలకలేనంత పేద్ద పేరుతో వస్తున్నాడు.

ఇకపోతే జీరోత్ లుక్ పేరుతో ''అంటే.. సుందరానికీ!'' చిత్రం నుంచి సుందరం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. నూతన సంవత్సరం కానుకగా 2022 జనవరి 1న సాయంత్రం 04.05 గంటలకు నాని లుక్ విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో పంచెకట్టులో ఉన్న నాని ని చూపించి.. ఇందులో హీరో పాత్ర సరికొత్తగా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి రాబోయే ఫస్ట్ లుక్ మీద అభిమానుల్లో ఆసక్తి కలుగుతోంది.

''అంటే.. సుందరానికీ!'' చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. 'బ్రోచేవారేవరురా' 'మెంటల్‌ మదిలో' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్.. ఇప్పుడు లవ్ అండ్ మ్యూజిక‌ల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. ఇందులో నాని సరసన నజ్రియా నజీమ్ ఫహాద్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే 'రాజా రాణి' అనే డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ నజ్రియా.. ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది.

మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్‌ యెర్నేని - యలమంచిలి రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం సమకూరుస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వ్యవహరిస్తుండగా.. ర‌వితేజ గిరిజాల ఎడిట‌ర్‌ గా వర్క్ చేస్తున్నారు. లతా దాస్యం ఆర్ట్ డైరెక్టర్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ''అంటే.. సుందరానికీ!'' చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.