Begin typing your search above and press return to search.

రవితేజ కోసం సోలోగా ఎదిగిన మరో హీరో

By:  Tupaki Desk   |   24 July 2022 8:32 AM GMT
రవితేజ కోసం సోలోగా ఎదిగిన మరో హీరో
X
తెలుగు సినిమా పరిశ్రమలో చాలా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందిన వారి సంఖ్య మెల్లగా పెరుగుతుంది అని చెప్పాలి. ఇక అందరికంటే ఎక్కువగా చాలా కష్టపడి పైకి వచ్చిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. మొదట దర్శకుడు కావాలి అని ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అనంతరం హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ను క్రియేట్ చేసుకున్నాడు.

మాస్ మహారాజా రవితేజ ఒకానొక సమయంలో మళ్ళీ డౌన్ అయినప్పటికీ కూడా క్రాక్ సినిమాతో ఊహించని విధంగా ఫామ్ లోకి వచ్చేసాడు. ఇక ప్రస్తుతం అతని నుంచి వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ సినిమాను జూలై 29న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించాలి అని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది.

ఇక ముందుగానే పక్క ప్రణాళికతో కొంత హైప్ కూడా క్రియేట్ చేశారు. ఫాన్స్ ఎవరు వచ్చినా కూడా తెల్లని చొక్కాలోనే రావాలి అని ఒక రూల్ కూడా పెట్టారు. దీంతో ఈ వేడుక స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. జూలై 24న ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోయే ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా ఎవరు వస్తున్నారు అనే విషయంలో మొదట అనేక రకాల రూమర్స్ వచ్చాయి.

ఇక రవితేజ కోసం ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సోలోగా ఎదిగిన హీరో రాబోతున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు. అతను మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని అని ప్రత్యేకంగా పోస్టర్ కూడా విడుదల చేశారు. దీంతో ఈ వేడుకకు మరింత హైప్ పెరిగింది. ఈ ఇద్దరు హీరోలు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి వచ్చిన వారే. మరి నాని రామారావు వేదికపై ఏ విధంగా మాట్లాడతాడో చూడాలి.