Begin typing your search above and press return to search.

పిక్ టాక్: అమెరికాలో వాలిపోయిన 'పంచెకట్టు' సుందరం..!

By:  Tupaki Desk   |   2 April 2022 1:11 PM GMT
పిక్ టాక్: అమెరికాలో వాలిపోయిన పంచెకట్టు సుందరం..!
X
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''అంటే.. సుందరానికీ!''. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవిలో విడుదలకు రెడీ అవుతోంది.

ఇప్పటికే రిలీజ్ చేయబడిన నాని జీరోత్ లుక్ మోషన్ పోస్టర్ మరియు 'బర్తడే హోమం' హోమ్ పేరుతో వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఓ పోస్టర్ వదులుతూ సరికొత్త అప్డేట్ ఇచ్చారు.

'అంటే.. సుందరానికీ!' సినిమా నుంచి 'పంచెకట్టు' అనే ఫస్ట్ సింగిల్ ని ఏప్రిల్ 6న సాయంత్రం గం. 6:03 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నాని అమెరికాలో ఓ కారులో ప్రయాణిస్తూ.. ఎంతో ఎగ్జైటింగ్ గా బయటకు చూస్తూ కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో K.P.V.S.S.P.R సుందర ప్రసాద్ అనే ఇన్నోసెంట్ బ్రాహ్మణ యువకుడి పాత్రలో నాని నటిస్తున్నారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఫహాద్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇది నజ్రియాకు తెలుగు డెబ్యూ మూవీ.

ఇందులో నరేష్ - రోహిణి - శ్రీకాంత్ అయ్యంగార్ - నదియా - హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ - పృథ్వీరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్‌ యెర్నేని - యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.

నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ర‌వితేజ గిరిజాల ఎడిట‌ర్‌ గా వర్క్ చేస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. 'అంటే.. సుందరానికీ' చిత్రాన్ని ఆవకాయ్ సీజన్ లో 2022 జూన్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.